గుడ్‌న్యూస్: ఆయుధాలు ఎగుమతి చేసే దేశాల జాబితాలో భారత్...!

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్ అంటే కేవలం ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగానే ప్రపంచానికి తెలుసు. అంతే కాదు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతి దేశం కూడా మనదే కావటం విదితమే. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకుంటుంది. దేశ రక్షణ కోసం, శత్రు దేశాలపై పై చేయి సాధించేందుకు ఆయుధాల దిగుమతి మనకు దోహదపడుతోంది. కానీ, వీటి దిగుమతుల కోసం ఇండియా ప్రతి ఏటా రూ వేల కోట్లలో నిధులు వెచ్చించాల్సి వస్తోంది.

అయితే, ఇటీవల ఇండియా లో గన్స్ తయారీ పుంజుకున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడవుతోంది. కేవలం తయారీ మాత్రమే కాదు... గన్స్ సహా ఇతర ఆయుధాల ఎగుమతులు కూడా ప్రారంభం కావటం విశేషం. దీంతో భారత్ తొలిసారి గ్లోబల్ అర్మ్స్ ఎక్సపోర్టర్స్ జాబితాలో చోటు సంపాదించింది. ఆ జాబితాలో 23 వ ర్యాంకు తో చివరన ఉన్నప్పటికీ... భవిష్యత్ లో మన దేశం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయుధాల ఎగుమతులు జరిగుతాయనేందుకు ఇది సంకేతంగా మారింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ లో ఒక ప్రత్యేక కథనం ప్రచురితమైంది.

32% తగ్గిన దిగుమతులు...

32% తగ్గిన దిగుమతులు...

ప్రపంచంలోనే సౌదీ అరేబియా తర్వాత అత్యంత భారీ స్థాయిలో ఆయుధాలు దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారత్ నిలుస్తోంది. కానీ, 2015 నుంచి ఇప్పటి వరకు క్రమంగా మన దేశం చేసుకునే ఆయుధాల దిగుమతులు తగ్గుతుండటం గమనార్హం. ప్రపంచ ఆయుధాల బదిలీ సమాచారం సేకరించే ప్రముఖ సంస్థ ఎస్ ఐ పీ ఆర్ ఐ ప్రకారం... గత ఐదేళ్ళలో ఇండియా చేసుకునే ఆయుధాల దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ సమయంలో ఏకంగా దిగుమతులు 32% పడిపోవటం విశేషం. అంటే క్రమంగా భారత్ ఆయుధాల దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ఆయుధాలను ఎగుమతి చేసే దిశగా ఎదుగుతుందని స్పష్టమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సగం ఆయుధాలు రష్యా నుంచే...

సగం ఆయుధాలు రష్యా నుంచే...

ఇండియా కు అత్యంత మిత్ర దేశమైన రష్యా నుంచి భారీ స్థాయిలో ఆయుధాల దిగుమతులు ఉంటాయి. సంప్రదాయబద్ధంగా మనం మన ఆయుధ, డిఫెన్స్ అవసరాల కోసం రష్యా పైనే అధికంగా ఆధారపడతాం. అందుకే రష్యా నుంచి మనం చేసుకునే అర్మ్స్ ఇంపోర్ట్స్ మన మొత్తం ఇంపోర్ట్స్ లో 56% వాటా కలిగి ఉంటాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ వాటా 14%, ఫ్రాన్స్ వాటా 12% గా ఉంది. అయితే, కొద్ది కాలంగా అమెరికా నుంచి మనం చేసుకునే ఆయుధాల దిగుమతులు తగ్గిపోతున్నాయి. అమెరికా నుంచి అపాచీ, చినూక్ హెలికాఫ్టర్లు, పీ8ఐ మారిటైం ఎయిర్క్రాఫ్ట్ వంటి అధునాతన యుద్ధ సంబంధిత దిగుమతులు పెరిగినా ... రష్యా కు కూడా ఎస్ -400, టీ -90 ట్యాంకుల దిగుమతి ఆర్డర్లు అధికంగానే ఉన్నాయి. కాగా, 2010-14 సమయంలో అమెరికా నుంచి ఇండియా చేసుకునే ఆయుధాల దిగుమతులు గణనీయంగా పెరిగిపోయి ఏకంగా ఆ దేశం రష్యా తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. కానీ 2015 నుంచి మళ్ళీ అక్కడి నుంచి దిగుమతులు తగ్గిపోయాయి.

5 బిలియన్ డాలర్ల లక్ష్యం ...

5 బిలియన్ డాలర్ల లక్ష్యం ...

తొలిసారి ఆయుధాల ఎగుమతి జాబితాలోకి ప్రవేశించిన ఇండియా... ఈ విషయంలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకారం.. వచ్చే ఐదేళ్ళలో 5 బిలియన్ డాలర్ల ఆయుధాల ఎగుమతులు చేయాలని ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం ఇరుగుపొరుగు మిత్ర దేశాలకు అవసరమైన లైన్ అఫ్ క్రెడిట్ ను పెంచేందుకు కూడా సంసిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఇండియా నుంచి అధికంగా ఆయుధాలు ఎగుమతి అవుతున్నది మయన్మార్ కు, ఆ తర్వాత శ్రీ లంక, మారిషస్ దేశాలకు కూడా మన ఆయుధాలు ఎగుమతి అవుతున్నాయి. మొత్తం మన ఆయుధాల ఎగుమతుల్లో దాదాపు సగం (46%) ఒక్క మయన్మార్ దేశానికి వెళుతుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+