China: దాదాపు ప్రతి విషయంలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడుగులు వేసింది. చైనా ఏకచత్రాధిపత్యానికి చెక్ పెట్టడం, 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దడంలో భాగంగా మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా వంటి వివిధ స్కీమ్స్ తీసుకొచ్చింది. అవి కొంతమేర సత్ఫలితాన్నిచ్చినా, ఇప్పటికీ డ్రాగన్ దేశం నుంచి ఇండియా చేసుకుంటున్న దిగుమతులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
పలు స్మార్ట్ ఫోన్ తయారీ మరియు అసెంబ్లీ కంపెనీలతో పాటు సెమీకండక్టర్ ప్లాంట్లు భారత్ కు తరలిరావడంతో.. చైనాకు ప్రత్యామ్నాయంగా ఇండియా ఎదుగడానికి ప్రయత్నిస్తోంది. మేకిన్ ఇండియాలో భాగం కావడానికి చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారులు సైతం స్థానికంగా ఇక్కడ ఆయా పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు.

అయితే స్వావలంబన దిశగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చైనా నుంచి భారతదేశం చేసుకుంటున్న దిగుమతులు FY23లో 4 శాతం కంటే ఎక్కువ పెరిగడం ఆలోచించాల్సిన విషయమే. దాదాపు 100 బిలియన్ డాలర్ల మేరకు డ్రాగన్ వైపు చూడాల్సి వచ్చింది. ముడి పదార్థాలు సహా ఇతర కీలక భాగాల విషయంలో చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తున్న ఈ సమయంలో.. దాని ఎగుమతులు సైతం 28 శాతానికి పడిపోయాయి.
ఉత్పత్తికి సంబంధించిన భారీ ప్రోత్సాహకాలు ప్రకటించి ఫాక్స్ కాన్ మరియు పెగాట్రాన్ సహా ఇతర తయారీదారులను ఆకర్షించడానికి భారత్ ప్రయత్నించి విజయం సాధించింది. అయితే ఈ చర్య వల్ల చైనా నుంచి ఇండియా చేసుకుంటున్న అధిక శాతం దిగుమతులకు చెక్ పెట్టినట్టయింది. వీటికి తోడు ఆ దేశ సంస్థలపై నిషేధం, మనీలాండరింగ్ కు పాల్పడిన పలు కంపెనీలకు జరిమానాలు విధించడం వంటి చర్యలకు సైతం కేంద్రం వెనకాడలేదు. ఇతర దేశాల నుంచి ఎరువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు భారత్ కు రావడంతో చైనా దిగుమతులు పెరుగుతున్నా, సరుకుల పరంగా తగ్గుముఖం పట్టడం విశేషం.


Click it and Unblock the Notifications