ఆర్థిక సంవత్సరం 2025-26 ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి, కాబట్టి ఈసారి మార్చి 31 (march 31) అనేది ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. చాలామంది తమ టాక్స్ వ్యవహారాలను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చూసుకుంటారులే అని వదిలేస్తుంటారు, కానీ కొన్ని కీలక నిర్ణయాలు యజమానిగా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాత టాక్స్ విధానం (Old Tax Regime) లో ఉన్న ప్రయోజనాలను పొందాలంటే ఈ రోజే ఆఖరి అవకాశం.

ఇన్వెస్ట్‌మెంట్స్, డిడక్షన్స్
సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పొందే పన్ను మినహాయింపులు వచ్చే ఏడాది నుండి ఆటోమేటిక్‌గా వర్తించవు. మీరు పాత పద్ధతిలోనే టాక్స్ కట్టాలనుకుంటే ఎల్‌ఐసి, పిపిఎఫ్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడానికి మార్చి 31 ఆఖరి తేదీ. అలాగే సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి టాక్స్ బెనిఫిట్ పొందాలనుకునే వారు కూడా ఈరోజే ఆ పని పూర్తి చేయాలి. రేపటి నుండి అమలయ్యే డెఫాల్ట్ టాక్స్ విధానంలో ఈ మినహాయింపులు ఉండవు.
అడ్వాన్స్ టాక్స్, టీడీఎస్ (TDS)
మీరు చెల్లించాల్సిన అడ్వాన్స్ టాక్స్ నాలుగో విడత మార్చి 15 నాటికే పూర్తి కావాలి. ఒకవేళ అది పెండింగ్‌లో ఉంటే వెంటనే చెల్లించండి, లేదంటే వడ్డీ భారం పెరుగుతుంది. అలాగే అక్టోబర్-డిసెంబర్ 2025 కాలానికి సంబంధించిన Q3 TDS రిటర్న్స్ దాఖలు చేయకపోతే రోజువారీ జరిమానా పడుతుంది. జీతాలు, అద్దె లేదా ప్రొఫెషనల్ ఫీజుల మీద కట్ చేసిన టీడీఎస్‌ను కూడా సకాలంలో డిపాజిట్ చేయడం మర్చిపోకండి.
బిజినెస్, జీఎస్టీ (GST) అప్‌డేట్స్
వ్యాపారస్తులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను రికన్సిల్ చేసుకోవడం, స్టాక్ వెరిఫికేషన్ చేయడం వంటి పనులు మార్చిలోనే పూర్తి చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ సులభం అవుతుంది. ఏప్రిల్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు ఉన్న అన్ని GST రిటర్న్స్ (GSTR-1, 3B) చెక్ చేసుకోండి. ఏదైనా ఒక్క నెల మిస్ అయినా మీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) రావడం కష్టమవుతుంది. అలాగే ఉద్యోగుల నుండి ఎల్ఐసి రసీదులు, ఇంటి అద్దె రసీదులు వంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ సేకరించి మార్చి జీతాల ప్రాసెసింగ్ పూర్తి చేయాలి.
ఈ పత్రాలను సరిచూసుకోండి
ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లోకి వెళ్లి మీ Form 26AS , AIS (Annual Information Statement) డౌన్‌లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న లెక్కలకు, పోర్టల్‌లో ఉన్న డేటాకు ఏవైనా తేడాలు ఉంటే ఇప్పుడే గుర్తించి సరిచేసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నవారు తమ డైరెక్టర్ల KYC (DIR-3 KYC) అప్‌డేట్ అయ్యిందో లేదో చూసుకోవాలి, లేదంటే పెనాల్టీలు పడటమే కాకుండా డిజిటల్ సంతకాలు కూడా చెల్లకుండా పోతాయి.
మొత్తంగా చెప్పాలంటే, మార్చి 31 లోపు ఈ పనులన్నీ పక్కాగా పూర్తి చేస్తే మీరు పన్ను ఆదా చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే నోటీసులు, జరిమానాల నుండి తప్పించుకోవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ వడ్డీ భారం పెరుగుతుంది, కాబట్టి ఈ చివరి నిమిషంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications