Tax Cut: సామాన్యులపై పన్నులు తగ్గించండి-కార్పొరేట్లకు కాదు.. ఇండియాలో టాక్సులు అధికం..
Budget 2025: భారతదేశంలో ప్రజలపై అత్యధికంగా పన్నులు అమలులో ఉన్నాయనే ఆందోళనలు చాలా మంది నుంచి పెరిగిపోతున్నాయి. నిపుణులు సైతం దీనిని వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్లకు ప్రయోజనాల కంటే సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం చాలా ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు.
2025 కేంద్ర బడ్జెట్ ముందు వ్యక్తిగత పన్నులను తగ్గించాలని ఐఎంఎఫ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా ఆర్థిక మంత్రికి పిలుపునివ్వటం మరోసారి అధిక పన్నులపై చర్చకు దారితీసింది. ప్రస్తుత సమయంలో ఇండియాలోని కార్పొరేట్లకు పన్ను ఉపశమనం కంటే వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలో కోత చాలా కీలకమైనదిగా ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందుగా విదేశీ పెట్టుబడి విధానాన్ని మార్చుకోవాలని ఆ తర్వాత పర్సనల్ ఇన్కమ్ టాక్స్ విషయంలో ఉపశమనానికి ప్రాధాన్యం చాలా ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

పన్ను రేట్ల తగ్గింపు ముందు సామాన్యులకు అవసరమని చివరిగా కార్పొరేట్లకు అవసరమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భల్లా స్పష్టమైన వాదనను వినిపించారు. ఈ క్రమంలో పన్ను భారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జీడీపీలో పన్నులకు 19 శాతం వాటా ఉందని అన్నారు. ఇది తూర్పు ఆసియా దేశాల సగటు 14.5 శాతం కంటే చాలా ఎక్కువగా ఉందని అన్నారు. అమెరికా లేదా కొరియా కంటే చాలా తక్కువ తలసరి ఆదాయం ఉన్న భారత్‌లో పన్ను-జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉండటంపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
పన్నుల భారాన్ని సామాన్యులపై తగ్గిస్తూ.. వ్యక్తిగత ఆదాయపు పన్నులను తగ్గించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్త పేర్కొన్నారు. తాను 2019లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు ప్రకటన సమయంలో పనిచేసినట్లు వల్లడించారు. వాస్తవానికి పన్నులు తగ్గించటం వల్ల ఆదాయాలు పెరుగుతాయి. పన్నులు తగ్గించటం వల్ల మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుతాయని అన్నారు. ఈ క్రమంలో విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించాలని ఆయన సూచించారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు ఇప్పటికే గొప్ప విజయాన్ని సాధించిందని అన్నారు.
ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పాయ్ కూడా సవరించిన పన్ను స్లాబ్‌లను ప్రతిపాదించారు. రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా మినహాయించాలని, ఇదే క్రమంలో రూ.5-10 లక్షలకు 10%, రూ.10-20 లక్షలకు 20%, రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి 30% పన్ను విధించాలని సూచించారు. ఇదే క్రమంలో ప్రపంచ పెద్దన్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ఆదాయపు పన్నును పూర్తిగా తొలగించాలని చూస్తున్నారు. అయితే భారత్ మాత్రం పన్నులు తగ్గించాలనే యోచనలో లేకపోవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications