కరోనా తర్వాత రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచ సరఫరా గొలుసు తెగి, దాదాపు అన్ని దేశాలు ప్రభావితం అయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ప్రస్తుతం 2022 సంవత్సరంలో 8.2 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. గతంలో 9 శాతం అంచనాలను ప్రకటించింది. ఇప్పుడు 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
భారత వృద్ధి 2022 క్యాలెండర్ ఏడాదిలో మందగించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. చైనా వృద్ధి అంచనాలను 4.4 శాతానికి భారత్ వృద్ధి అంచనాలు దాదాపు రెట్టింపు. 2021లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 6.1 శాతం కాగా, 2022లో ఇది 3.6 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేస్తోంది. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ రిపోర్ట్‌లో వృద్ధి అంచనాలను పేర్కొంది.

చమురు ధరలు అంతర్జాతీయంగా భారీగా పెరిగాయని, ఈ ప్రభావం భారత వృద్ధిపై ప్రభావం చూపుతోందని, ఇది ప్రయివేటు వినియోగం, పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 3.1 శాతంగా ఉండవచ్చునని, 2021-22తో పోలిస్తే ఇది 1.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2023-24 జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కూడా 7.1 శాతం నుండి 6.9 శాతానికి తగ్గించింది. కరోనా నుండి కోలుకుంటున్న వివిధ దేశాలపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం చూపిందని ఐఎంఎఫ్ గీతా గోపినాథ్ అన్నారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications