Retirement: 24 ఏళ్లకే గూగుల్‌లో జాబ్.. 29 వయస్సులో రిటైర్‌మెంట్.. ఇది కదా పక్కా ప్లానింగ్..
Retirement at 29: ఈ మధ్య ఎర్లీ రిటైర్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరి ఆశయంగా మారుతోంది. ఓపిక ఉన్నంత మేర ఎక్కువ సంపాదించి, కొంత కాలం అయిన తర్వాత ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకోవాలనే భావన పెరుగతూ వస్తోంది. అయితే ఈ వ్యక్తి రిటైర్‌మెంట్ వయసు వింటే ఔరా అనక తప్పదు మరి!
డేనియల్ జార్జ్ అనే 29 ఏళ్ల వ్యక్తి IIT బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో స్పెషలిస్ట్. ముందస్తు పదవీ విరమణ కోసం తగిన స్థాయిలో డబ్బు సంపాదించినట్లు ఇటీవల వెల్లడించాడు. 2018లో 24 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన BTech పూర్తి చేసినట్లు చెప్పాడు. అమెరికాలోని గూగుల్ సంస్థలో వేసవి ఇంటర్న్‌షిప్ పొందడంతో ఏడాదికి 2.20 కోట్ల జీతం వరించినట్లు పేర్కొన్నాడు.

తనకు 24 ఏళ్లు ఉన్నప్పుడే రిటైర్‌మెంట్ గురింంచి ఆలోచించడం ప్రారంభించినట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. ఇంటర్న్‌షిప్ తర్వాత గూగుల్ Xలో ఉద్యోగంలో చేరడంతో తన జీవితం ఓ ముఖ్యమైన మలుపు తిరిగినట్లు తెలిపాడు. ఆ సమయంలోనే పదవీ విరమణ ఖాతాల గురించి తెలుసున్నట్లు చెప్పాడు. దీంతో పన్ను బాధ్యతలు తగ్గించుకుంటూ, క్రమశిక్షణతో కూడిన ఖర్చులు చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించాడు.
ముందస్తు పదవీ విరమణ కోసం గూగుల్, ఆపిల్, అమెజాన్, ఎన్‌విడియా మరియు టెస్లా వంటి టెక్ స్టాక్‌లలో డేనియల్ జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాడు. ఇందుకు తోడు పొదుపు పాఠాలను కూడా బాగా అవపోసన పట్టినట్లు చెప్పాడు. తన ఆదాయంలో 10 శాతం కంటే తక్కువను రోజువారీ ఖర్చులకు ఉపయోగించడం తన విజయంలో కీలక భాగమని పేర్కొన్నాడు.
గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడే భోజనం చేసేవాడినని గుర్తుచేసుకున్నాడు. ఆఫీసుకు కూడా నడిచి వెళ్లడం, అత్యధిక అద్దె కలిగిన సిలికాన్ వ్యాలీ నుంచి దూరంగా వెళ్లి ఇతర స్నేహితులతో కలిసి అపార్ట్‌మెంట్‌ను షేర్ చేసుకున్నట్లు వివరించాడు. విలాసవంతమైన వస్తువుల పట్ల వ్యామోహ పడలేదని, అయితే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదంటూ పొదుపు పాఠాలు చెప్పాడు.


Click it and Unblock the Notifications