మీరు వేరే జాబ్ కి మారితే లేదా EPF కిందకు రాకుండా ఉన్న సంస్థలో చేరితే, EPF కాంట్రిబ్యూషన్ ఆటోమాటిక్‌గా ఆగుతుంది. కానీ ఖాతా కొంతకాలం యాక్టివ్‌గా ఉంటుంది. ఆ యాక్టివ్ పీరియడ్‌లో, EPFO నిర్ణయించిన రేటుకు వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అంటే, కొత్త కాంట్రిబ్యూషన్ ఆగినా, డబ్బు పూర్తిగా నిలిచిపోతోంది, కానీ వృద్ధి కొంతకాలం తర్వాత ఆగిపోతుంది.
ఇప్పుడూ కొత్త కాంట్రిబ్యూషన్ ఆగినా, అప్పటివరుకు ఉన్నా డబ్బుకి వడ్డీ అకౌంట్ లో పడుతునే ఉంటుంది. కానీ మూడు సంవత్సరాలు కాంట్రిబ్యూషన్ లేకపోతే ఖాతా "ఇనాక్టివ్"గా మారుతుంది. ఆ తర్వాత కొత్త వడ్డీ కలవదు, కానీ మీ EPF మొత్తం సురక్షితంగా EPFO వద్ద ఉంటుంది. మీరు ఎప్పుడైనా అది విత్‌డ్రా చేయవచ్చు.

విత్‌డ్రా విషయానికి వస్తే, మీరు రెండు నెలల కంటే ఎక్కువ నిరుద్యోగులు అయితే, EPF బెలెన్స్ తీసుకోవచ్చు. కానీ మొత్తం సర్వీస్ ఐదు సంవత్సరాలకంటే తక్కువ అయితే, విత్‌డ్రా చేసిన మొత్తం టాక్స్ కింద వస్తుంది. మీ కాంట్రిబ్యూషన్, Employer కాంట్రిబ్యూషన్, మరియు వడ్డీ ఆదాయ పన్ను పాయింట్ ప్రకారం టాక్స్ చేయబడుతుంది. యాక్టివ్ పీరియడ్‌లో వడ్డీ పెరుగుతూనే ఉంటే, ఆ వడ్డీ టాక్స్ చేయబడదు.
EPF ఖాతాను ఉట్టిగా వదిలేయడం కన్నా, జాబ్ మారినపుడు ట్రాన్స్ఫర్ చేయడం మంచిది. UAN (Universal Account Number) ద్వారా మీరు అన్ని EPF ఖాతాలను లింక్ చేసి, EPFO వెబ్‌సైట్‌లో సులభంగా షిఫ్ట్ చేయవచ్చు. ఇది మీ సర్వీస్ రికార్డ్ కాపాడుతుంది, టాక్స్ బెనిఫిట్స్ రక్షిస్తుంది, మరియు డబ్బు పెరుగుతూనే ఉంటుంది.
EPF ఖాతాను వదిలేయడం పెద్ద లాంగ్-టర్మ్ సంపదను కోల్పోవడానికి కారణం అవుతుంది. సంవత్సరాలుగా వడ్డీ లాస్స్, టాక్స్ లాస్, మరియు పాత ఖాతా తిరిగి యాక్టివ్ చేయడంలో సమస్యలు రావచ్చు, ముఖ్యంగా KYC లేదా బ్యాంక్ వివరాలు outdated అయితే. కాబట్టి, EPF వివరాలను పీరియాడిక్‌గా అప్‌డేట్ చేయడం, మల్టిపుల్ ఖాతాలను కన్సాలిడేట్ చేయడం మంచి ఆర్థిక క్రమశిక్షణకి తోడ్పడుతుంది, అలాగే రిటైర్మెంట్ కోసం ఎక్కువ పొదుపు చేయడంలో సహాయపడుతుంది.
ఇనాక్టివ్ ఖాతాలను నిర్లక్ష్యం చేయడం:
చాలా మంది జాబ్ మారిన తర్వాత పాత EPF ఖాతాను అలాగే వదిలేస్తారు. కానీ ఇలా ఎక్కువకాలం వదిలేస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయి. KYC వివరాలు (ఆధార్, పాన్ మొదలైనవి) అప్‌డేట్ చేయకపోతే మిస్ మ్యాచ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతా మార్పులు లేదా పాత employer డీటెయిల్స్ మారిపోవడం వలన, విత్‌డ్రా లేదా ట్రాన్స్ఫర్ సమయంలో ధృవీకరణ సమస్యలు వస్తాయి. ఫలితంగా, మీ సొంత డబ్బు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో EPFO వద్ద పాత రికార్డులు ట్రేస్ చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, EPF ఖాతా ఇనాక్టివ్‌గా మారిన వెంటనే దానిని అప్‌డేట్ చేయడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం చాలా ముఖ్యం.
ఉదాహరణకి, ఒక ఉద్యోగి పాత EPF ఖాతాలో రూ. 2 లక్షలు ఉన్నప్పుడు కొత్త కంపెనీలో చేరి, పాత ఖాతాను అలాగే వదిలేశాడని అనుకుందాం. మూడు సంవత్సరాలు కొత్త కాంట్రిబ్యూషన్ లేకపోవడంతో ఆ ఖాతా "ఇనాక్టివ్"గా మారింది. EPFO వడ్డీ రేటు సంవత్సరానికి 8% అని తీసుకుంటే, ఆ రూ. 2 లక్షల మీద వడ్డీ పెరగకపోవడం వలన మూడు సంవత్సరాల్లో సుమారు రూ. 48,000 వరకు వడ్డీ లాభం కోల్పోయే అవకాశం ఉంది. ఇది చిన్న మొత్తం అనిపించినా, దీర్ఘకాలంలో కాంపౌండింగ్ వలన ఈ లాస్ మరింత పెరుగుతుంది. అదనంగా, ఆ తర్వాత విత్‌డ్రా చేసుకోవాలంటే పాత బ్యాంక్ ఖాతా, KYC మిస్ మ్యాచ్, లేదా employer డీటెయిల్స్ మార్పుల వలన క్లెయిమ్ ప్రాసెస్ లేట్ అయ్యే ప్రమాదం ఉంది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications