పాన్-ఆధార్ కార్డు లింక్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. చాలాకాలంగా లింక్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూనే, కరోనా సహా వివిధ కారణాలతో ఈ గడువును పొడిగిస్తోంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన కేంద్రం నిన్న మరోసారి ఊరట కల్పించింది. ఇదివరకు ఆధార్ కార్డుతో పాన్‌తో అనుసంధానం చేయడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉంది. దీనిని మరో ఆరునెలల వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఆధార్ కార్డ్-పాన్ కార్డ్ లింక్ గడువును పొడిగించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఓ ప్రకటన జారీ చేసింది. ఈ పొడిగింపు ప్రకారం బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలను ఓపెన్ చేసేవారు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు అందించాలి.
రోజువారీ చర్యలకు, ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక అవసరాలకు.. ఇలా ఎన్నింటికో ఆధార్ కార్డు, పాన్ కార్డు అవసరం తప్పనిసరి. ప్రస్తుతం కరోనా వ్యాక్సీన్ వేసుకునే వారికి ఆధార్ కార్డు చూపించడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక అంశాలకు సంబంధించి పాన్ కార్డు కీలకం. ఈ రెండింటిని లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండో చెబుతోంది. వివిధ కారణాలతో గడువును పొడిగిస్తోంది. డీమ్యాట్ సహా బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు ఆధార్-పాన్ కార్డుల లింక్‌ను కలిగి ఉండాలంటూ ఆర్బీఐ గతంలోనే ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం లింకింగ్ గడువును 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగించినందున లింక్ చేయని వారికి ఊరట అని చెప్పవచ్చు.

కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, ఖాతాదారులు ఎదురుకొంటోన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ తెలిపింది. పాన్‌కార్డులు చాలా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిల్లో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని ఆధార్‌తో లింక్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఖాతాదారుల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకత నేపథ్యంలో గడువును పొడిగింస్తూ వస్తోంది సీబీడీటీ.
ఆదాయపు చట్టం 1961 సెక్షన్ 139AA ప్రకారం పాన్ నెంబర్ కలిగి ఉన్న, అలాగే ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తులు తమ ఈ రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడం అవసరం. గడువులోగా లింక్ చేయకుంటే పాన్ కార్డు ఇన్-ఆపరేటివ్ అవుతుంది. పాన్-ఆధార్ లింకింగ్ ఇలా...
- ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి.
- ఇప్పటికే రిజిస్టర్ కాకుంటే రిజిస్టర్ చేసుకోవాలి. మీ పాన్ నెంబర్ మీ యూజర్ ఐడీ.
- యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగ్-ఇన్ కావాలి.
- పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. పాన్-లింక్ ఆధార్ చేసుకోమని చెబుతుంది. లేదంటే మెనూ బార్‌లోని ప్రొఫైల్ సెట్టింగ్‌లోకి వెళ్లి, లింక్ ఆధార్ కార్డు పైన క్లిక్ చేయాలి.
- పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు పాన్ డిటైల్స్ ఆధారంగా ఉండాలి.
- మీ ఆధార్‌లో పేర్కొన్న వాటితో పాన్ వివరాలను స్క్రీన్ పైన ధృవీకరించాలి. ఒకవేళ మిస్-మ్యాచ్ అయితే మరొక దానితో సరిపోయేలా డాక్యుమెంట్‌లో అప్ డేట్ చేయాలి.
- డిటైల్స్ ఒకేలా ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, లింక్ నౌ బటన్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్-పాన్ లింకింగ్ సక్సెస్ అని పాప్-అప్ సందేశం వస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications