ప్రపంచం తనపై ఎన్నో ఆశలు పెట్టుకుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ మంగళవారం భారత వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. స్టీల్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర కార్పోరేట్ రంగాలకు చెందిన సీఈవోలు, ప్రమోటర్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ భేటీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీం ద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన, మరిన్ని వాణిజ్య కథనాలు

అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకారం..
అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు తనదైన సహకారం అందించానని ట్రంప్ అన్నారు. పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు సృష్టించేందుకు తాను మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తామన్నారు. ఈ ఏడాది అమెరికాలో ఎన్నికలు ఉన్నాయి. అమెరికన్ భారతీయుల మనసు దోచేందుకు, వారి ఓట్ల కోసమే ట్రంప్ పర్యటన అనే వాదనలు ఉన్నాయి.

నేను ఓడిపోతే మార్కెట్లు కూలుతాయి
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను కనుక ఓడిపోతే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతాయని ట్రంప్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్టాక్ మార్కెట్లు పడిపోతాయన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

నేను గెలిస్తే పండుగే
అమెరికా అధ్యక్షఎన్నికల్లో తాను గెలిస్తే మార్కెట్లకు పండుగేనని ట్రంప్ చెప్పారు. ఓడిపోతే మాత్రం నష్టపోవడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం అమెరికా ఆర్థిక, ఆరోగ్య, సైనిక రంగాల కోసం ఎంతో చేసిందన్నారు.

కరోనా వైరస్‌పై ఏమన్నారంటే..
కరోనా వైరస్ అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. అన్ని పరిస్థితులను గమనిస్తున్నామని, చైనాతో మాట్లాడుతున్నామన్నారు. కరోనాను మట్టుబెట్టేందుకు అమెరికా సైతం ప్రయత్నిస్తోందన్నారు. దాదాపు 2.5 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కరోనా అంతానికి చైనా శ్రమిస్తోందన్నారు. చైనాలో రెండు వేల మందికి పైగా ప్రాణాలు తీసుకున్న కరోనా, ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications