ఈ ఏడాది మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)కి ఆధార్‌ను లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు చాలాసార్లు పొడిగించారు. అయితే, ప్రస్తుత గడువులోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పని చేయదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్-ఆధార్ లింకింగ్ కొందరికి మినహాయింపు ఉంది.

ఈశాన్య రాష్ట్రాలు
ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులకు మనహాయింపు ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వారికి మినహాయింపు ఉంది. ప్రస్తుతం పాన్ తో ఆధార్ లింక్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

పాన్‌ను ఆధార్‌తో ఎలా చేయాలంటే..
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి- eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in
2. ఇప్పటికే రిజిస్టర్ చేయకుంటే మీ పాన్‌తో యూజర్ IDగా పోర్టల్‌లో నమోదు చేసుకోండి.
3. పోర్టల్‌లోకి లాగిన్ చేయండి.
4. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో కనిపిస్తుంది. మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్‌లు'కి వెళ్లి లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
5. పాన్ కార్డ్ వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు కనిపిస్తాయి.
6. ఆధార్‌తో వివరాలను ధృవీకరించాలి. వివరాలు సరిపోలితే, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, లింక్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసే ఇతర పద్ధతులు
1. లింక్ చేసే ప్రక్రియ కోసం వ్యక్తులు క్రింది వెబ్‌సైట్‌లను కూడా సందర్శించవచ్చు- https://www.utiitsl.com/, https://www.egov-nsdl.co.in/
2. SMS ద్వారా: కింది సందేశం UIDPANని టైప్ చేయండి. సందేశాన్ని 567678 లేదా 56161కు పంపవచ్చు.
3. సమీపంలోని PAN సేవా కేంద్రాలను సందర్శించడం: సమీపంలోని PAN సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా లింక్ చేసే ప్రక్రియను మాన్యువల్‌గా కూడా చేయవచ్చు.
More From GoodReturns

డెలాయిట్ 50 వేల ఉద్యోగాల ప్రకటన.. 30 వేల మందికి ఏఐపై ప్రత్యేక శిక్షణ..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications