IEX: ఐఈఎక్స్ షేర్లలో పతనం కొనసాగుతోందా..!
ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) షేర్లు శుక్రవారం వరుసగా మూడో రోజు కూడా పతనమయ్యాయి. గత మూడు సెషన్లలో షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి. మార్కెట్ కప్లింగ్‌ను అమలు చేయాలనే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయంతో IEX షేర్లు పతనమవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ఈ వ్యవస్థలో అన్ని ఎక్స్ఛేంజీలలో ఏకరీతి మార్కెట్ ధరను నిర్ణయించడంతో పాటు కొనుగోలు, అమ్మకం బిడ్‌లను సేకరించేందకు ఒక స్వతంత్ర సంస్థ ఉంటుంది. ప్రస్తుతం, భారతదేశంలో విద్యుత్ స్పాట్ ధర నిర్ణయానికి IEX ప్రముఖ వేదిక. కేంద్ర విద్యుత్ శాఖ నిర్ణయంతో విద్యుత్ స్పాట్ ధరను ఐఈఎక్స్ నిర్ణయించలేదు. దీని వల్ల ఐఈఎక్స్ లాభాలు తగ్గే అవకాశం ఉండడంతో ఐఈఎక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.

ఐఈఎక్స్ గురువారం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 8 శాతం పైగా నష్టపోయి రూ. 136.45 వద్ద ముగిసింది. శుక్రవారం షేరు మరో 10 శాతం పడిపోయి కొత్త 52 వారాల కనిష్టానికి చేరుకుంది. విద్యుత్ మార్కెట్ లో IEX స్పష్టమైన గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. స్పాట్ మార్కెట్ లావాదేవీలలో 90 శాతానికి పైగా నిర్వహిస్తోంది.
మార్కెట్ కప్లింగ్ మెకానిజం వేర్వేరు పవర్ ఎక్స్ఛేంజీల నుంచి ఆర్డర్‌లను సేకరిస్తుంది, ఒకే అల్గారిథమ్‌ను పాస్ చేస్తుంది, తద్వారా అన్ని ఎక్స్ఛేంజీలకు ఒక ధరను నిర్ణయిస్తుంది. ఈ మెకానిజం కొత్త కంపెనీలను ఎక్స్ఛేంజ్ స్పేస్‌లోకి ప్రవేశించేలా ప్రోత్సహిస్తుంది. పవర్ ధర నిర్ణయం కోసం IEXపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. ఈ ముఖ్యమైన మార్పు IEX వాల్యూమ్‌లను ప్రభావితం చేస్తుంది.
మార్కెట్ కప్లింగ్ విషయాన్ని CERC నిర్వహిస్తుందని IEX CMD, సత్యన్నారాయణ గోయెల్ తెలిపారు. కప్లింగ్ మెకానిజం అమలు చేయడానికి సమయం పడుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications