ముంబై: ప్రైవేట్ సెక్టార్‌లో అతి పెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ).. తన నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించి రాణించింది. బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో 59.4 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.
దీని విలువ 7,018.7 కోట్ల రూపాయలు. నిజానికి ఐసీఐసీఐ నాలుగో త్రైమాసికం ప్రివ్యూ అంచనాలు 6,450 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దీనికి మించి రాణించిందీ బ్యాంక్. 7,018.7 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరంలోఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాలు 4,403 కోట్ల రూపాయలు. ఇక నికర వడ్డీ ఆదాయం కూడా 21 శాతం మేర పెరిగింది. 12,605 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇదివరకు ఈ మొత్తం 4,737 కోట్ల రూపాయలు.

నిరర్థక ఆస్తుల విలువ స్వల్పంగా క్షీణించింది. 53 బేసిస్ పాయింట్లు అంటే 3.6 శాతం మేర తగ్గింది. నికర నిరర్థక ఆస్తుల విలువ సైతం తగ్గింది. 0.76 శాతంతో తొమ్మిది బేసిస్ పాయింట్ల మేర క్షీణత కనిపించింది. నాలుగో త్రైమాసికంలో గ్రాస్ ఎన్పీఏ 4,204 కోట్ల రూపాయలుగా రికార్డయింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఈ మొత్తం 4,018 కోట్ల రూపాయలు. బ్యాంక్ అడ్వాన్సులు భారీగా పెరిగాయి. 17 శాతం మేర వృద్ధి నమోదు చేశాయి.
గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన రుణాలను మినహాయించి- రిటైల్ లోన్ పోర్ట్‌ఫోలియోలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లు 14 శాతం మేర పెరిగాయి. దీని విలువ 10.64 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం టర్మ్ డిపాజిట్లల్లో తొమ్మిది శాతం మేర పెరుగుదల నమోదైంది. దీని విలువ 5.46 లక్షల కోట్ల రూపాయలు. మొత్తంగా ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో మంచి పురోగతిని రికార్డు చేసింది. దీనితో తన షేర్ హోల్డర్లకు శుభవార్త వినిపించింది. ఒక్కో షేర్‌పై అయిదు రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications