అసలే కరోనా వైరస్.. టూ వీలర్, కార్ల విక్రయాలు అంతంత మాత్రమే. కానీ హ్యుండాయ్ వెన్యూ కారు మాత్రం భారీగానే అమ్ముడుపోయాయి. ఏడాదిలో లక్ష కార్లు విక్రయించినట్టు ఈ మేరకు కంపెనీ శుక్రవారం సంస్థ ప్రకటించింది. గతేడాడి మే నెలలో వెన్యూ కార్ల విక్రయాలను ప్రారంభించారు. వాస్తవానికి వెన్యూ లాంచ్ అయ్యే సమయంలో ఆటోమొబైల్ కంపెనీలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. తర్వాత మాంద్యం, వైరస్ ప్రభావం ఉన్నా.. ఇంతమొత్తంలో కార్ల విక్రయాలు జరిగాయి.
దేశంలో 97 వేల 400 వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇతర దేశాల్లో 7400 కార్లను సేల్ చేసింది. భారతీయ కొనుగోలుదారులలో వెన్యూ ఆదరణ పొందింది. 2020 ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది. వెన్యూ పెట్రోల్, డీజిల్ రెండు వెర్షన్లలో.. వివిధ ఆప్షన్లతో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. భద్రతా ప్రమాణాల విషయంలోనూ కంపెనీ రాజీపడలేదు. భద్రత విషయంలో ఏఎన్‌సీఏపీలో నాలుగు రేటింగ్ ఇచ్చింది అంటే సెక్యూరిటీని అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు యువత మెచ్చేలా కారును రూపొందించారు.

భారతీయ మార్కెట్లో వెన్యూ.. మారుతీ సుజుకీ విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, కియో సొనెట్, నిస్సాన్ కంపెనీకి చెందిన ఎస్‌యూవీలతో పోటీపడుతోంది. కానీ విక్రయాలు మాత్రం వాటి కన్నా కొంచెం ఎక్కువే ఉన్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications