Hyundai row: హ్యుండాయ్ 'కాశ్మీర్'పై దక్షిణ కొరియా పశ్చాత్తాపం
కాశ్మీర్ పైన ట్వీట్ చేసి తీవ్రవివాదంలో చిక్కుకున్న హ్యుండాయ్ ఇప్పుడు క్షమాపణలు కోరుతోంది. ఇప్పటికే హ్యుండాయ్ పాకిస్తాన్ చేసిన పొరపాటుకు హ్యుండాయ్ ఇండియా క్షమాపణలు కోరింది. తాజాగా దక్షిణ కొరియా విదేశాంగ శాఖమంత్రి భారత ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్(EAM) జైశంకర్‌కు ఫోన్ చేశారు. జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. సామాజిక అనుసంధాన వేదిక (ట్విట్టర్, ఫేస్‌బుక్) ద్వారా భారత ప్రజలు, భారత ప్రభుత్వం మనసును నొప్పించినందుకు పశ్చాత్తాపం ప్రకటించారు. హ్యుండాయ్ పాకిస్తాన్ ట్వీట్ పైన భారత్ తీవ్రంగా స్పందించింది. కొరియా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

రాయబారిని పిలిపించి అసంతృప్తి
మంగళవారం భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారిని పిలిపించి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు, సియోల్‌లోని భారత రాయబారి కూడా దక్షిణ కొరియా ప్రభుత్వానికి ఇదే సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో EAM జైశంకర్ స్పందిస్తూ... కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు యోంగ్ నుండి తనకు కాల్ వచ్చిందని, హ్యుండాయ్ విషయం చర్చించారని తెలిపారు.

ఎంఈఏ ఇండియా ఏమన్నారంటే
హ్యుందాయ్ పాకిస్తాన్ నుండి ఆమోదయోగ్యం కానీ సోషల్ మీడియా పోస్ట్ పైన భారత ప్రభుత్వ తన అసంతృప్తిని వ్యక్తం చేసిందని, ఈ అంశం భారత దేశ ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశమని, ఇందులో రాజీపడనట్లు తెలిపిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని MEA ఇండియా అరిందమ్ బాగ్చీ అన్నారు.

హ్యుండాయ్ ఇండియా
హ్యుండాయ్ పాకిస్తాన్ చేసిన ఓ ట్విట్టర్ పోస్ట్ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. హ్యుండాయ్ పాకిస్తాన్ అఫీషియల్ ట్వీట్ పైన భారత నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వేర్పాటువాదానికి అండగా ఉన్నందుకు హ్యుండాయ్ కొనుగోలు చేయకూడదని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. హ్యుండాయ్ వాహనాన్ని కొనుగోలు చేయవద్దని పలువురు పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా అనుసంధాన వేదికలు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పెద్ద ఎత్తున స్పందించారు. దీంతో హ్యుండాయ్ ఇండియా స్పందించింది.


Click it and Unblock the Notifications