For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫస్ట్ డే 200 కార్ల ఉత్పత్తి, పెరుబందూర్ హ్యుండాయ్ ప్లాంట్ నుంచి.. భౌతిక దూరం పాటిస్తూ...

|

కరోనా వైరస్ వల్ల గత 45 రోజుల నుంచి పరిశ్రమలు మూతబడిన సంగతి తెలిసిందే. జోన్లవారీగా విభజించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలను అనుమతి ఇచ్చింది, దీంతో చెన్నైలో హ్యుండాయ్ కంపెనీ తమ కార్ల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత ప్లాంట్ నుంచి 200 కార్లు బయటకొచ్చాయని కంపెనీ ప్రకటించింది.

శ్రీ పెరుబందూరులో గల హ్యుండాయ్ కంపెనీలో ఉత్పత్తిని నిన్న ప్రారంభించారు. ప్లాంట్‌లో పనిచేస్తోన్న సిబ్బంది కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కంపెనీ పేర్కొన్నది. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌లు వేసుకొని కార్ల ఉత్పత్తి చేశారని పేర్కొన్నది.

Hyundai rolls out 200 vehicles from Chennai plant on first day..

ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను యథాస్థితికి తీసుకొచ్చేందుకు అనేక పరిశ్రమలకు దశలవారీగా అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరుబందూరులోని హ్యుండాయ్ ప్లాంట్‌లో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు.

English summary

ఫస్ట్ డే 200 కార్ల ఉత్పత్తి, పెరుబందూర్ హ్యుండాయ్ ప్లాంట్ నుంచి.. భౌతిక దూరం పాటిస్తూ... | Hyundai rolls out 200 vehicles from Chennai plant on first day..

Hyundai Motor India on Saturday said its Chennai-based manufacturing facility rolled out 200 cars on the first day of resuming production
Story first published: Saturday, May 9, 2020, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X