దిగ్గజ ఆటోమొబైల్ మేకర్ హ్యుండాయ్ పాకిస్తాన్ చేసిన ఓ ట్విట్టర్ పోస్ట్ వివాదానికి కారణమైంది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హ్యుండాయ్ ఇండియా స్పందించింది. హ్యుండాయ్ పాకిస్తాన్ అఫీషియల్ ట్వీట్ పైన భారత నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. వేర్పాటువాదానికి అండగా ఉన్నందుకు హ్యుండాయ్ కొనుగోలు చేయకూడదని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. హ్యుండాయ్ వాహనాన్ని కొనుగోలు చేయవద్దని పలువురు పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా అనుసంధాన వేదికలు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా పెద్ద ఎత్తున స్పందించారు. దీంతో హ్యుండాయ్ ఇండియా స్పందించింది.

అసలేం జరిగింది?
హ్యుండాయ్ పాకిస్తాన్.. కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఫిబ్రవరి 5వ తేదీన దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయినవారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీర్ సంఘీభావ దినాన్ని జరుపుకుంటారు ఆ దేశంలో. అయితే హ్యుండాయ్ పాకిస్తాన్ ఆ రోజున భారత్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టింది. మన కాశ్మీరి సోదరుల త్యాగాలను గుర్తు చేసుకుందామని, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదామని పేర్కొంది. అంతేకాదు, హ్యుండాయ్ పాకిస్తాన్, కాశ్మీర్ సాలిడరిటీడే అని ట్యాగ్స్ ఇచ్చింది.

భారతావని ఆగ్రహం
కాశ్మీర్ భారత్‌లో భాగం. అలాంటి కాశ్మీర్ పైన దాయాది పాకిస్తాన్ చేసే కుట్రలను సమర్థించేట్లుగా హ్యుండాయ్ పాకిస్తాన్ ట్వీట్ ఉండటం భారతావనికి ఆగ్రహం తెప్పించింది. దీంతో బాయ్‌కాట్ హ్యుండాయ్ అంటూ భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'హెలో హ్యుండాయ్, తీవ్రవాద పాకిస్తాన్‌కు మద్దతుగా ఎలా మాట్లాడుతారు, మా భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉండాలనుకుంటే ఇక్కడి నుండి వెళ్లిపోండి, హ్యుండాయ్ క్షమాపణలు చెప్పాలి లేదా వెళ్ళిపోవాలి, బ్రాండ్స్ ఇలా రాజకీయాల్లోకి రావడం ఏమిటి, ఇక హ్యుండాయ్ కాదు, హ్యుండై(hyundie), తీవ్రవాద పాకిస్తాన్‌కు మద్దతుగా ఉంటే, భారతీయులు మీ ఉత్పత్తులు కొనడంపై పునరాలోచన చేస్తారు'.. ఇలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.

దిగొచ్చిన హ్యుండాయ్
భారతీయుల ఆగ్రహం నేపథ్యంలో ఈ కొరియాకు చెందిన కార్ల కంపెనీ దిగొచ్చింది. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన తత్వానికి తాము కట్టుబడి ఉన్నామని, 25 ఏళ్ళుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, కార్ల అమ్మకాల్లో సంస్థకు భారత్ రెండో ఇల్లు అని పేర్కొంది.హ్యుండాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ కూడా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోందని, ఇక్కడి నుండే దక్షిణ అమెరికా దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది హ్యుండాయ్.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications