హైదరాబాద్‌లో భారీ ట్రేడింగ్ స్కాం.. రూ. 70 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి

దేశ వ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారు. లక్షలాది రూపాయలు అమాయకుల వద్ద నుంచి గుంజుకుంటున్నారు. పోలీసులు ఎంత జాగ్రత్తలు చెప్పినా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు.ఫేక్ లింకులు పట్ల జాగ్రత్తగా ఉండమని సైబర్ నిపుణులు ఎంత హెచ్చరించినప్పటికీ డబ్బు వస్తుందని ఆశతో క్లిక్ చేసి మోసపోతున్నారు అమాయకులు.

తాజాగా హైదరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్టాక్ ట్రేడింగ్ మోసంలో ఇరుక్కుపోయిన ఓ ప్రైవేట్ ఉద్యోగి రూ.70 లక్షలకు పైగా పోగొట్టుకున్నాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన 43 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఈ స్కాంలో ఇరుక్కుపోయాడు. చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్ ట్రేడ్‌లలో పెట్టుబడి పెడుతున్నానని నమ్మించిన మోసగాళ్లు అతని వద్ద నుంచి లక్షలాది రూపాయలు గుంజుకున్నారు.

Zerodha trading scam Hyderabad trading fraud 70 lakh scam Hyderabad fake Zerodha app fraud online trading scam India investment fraud India 2025 Zerodha scam news cyber fraud Hyderabad trading app fake alert financial scam India Zerodha impersonation fraud fake trading platform alert 70

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్వాల్‌లో నివాసం ఉండే 43 ఏళ్ల చిరుద్యోగిని వాట్సాప్ ద్వారా మోసగాళ్లు అయిన హనన్ డెల్వి, ఇషితా పాల్ సంప్రదించారు. ఈ మోసగాళ్లు చట్టబద్ధమైన స్టాక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జెరోధా ప్రతినిధులు మాదిరిగా నటిస్తూ అతడిని మాయలో పడేశారు. మోసగాళ్ళు షేర్డ్ వెబ్ లింక్ ద్వారా జెరోధా ట్రేడింగ్ అప్లికేషన్ అంటూ ఓ లింక్ పంపి దాన్ని మొబైల్ లో ఇన్‌స్టాల్ చేయమని అతన్ని నమ్మించారు.


అది నమ్మిన ఉద్యోగి లింక్ ఓపెన్ చేశాడు. ఏప్రిల్ 30, మే 26 మధ్య చట్టబద్ధమైన స్టాక్ మార్కెట్ ట్రేడ్‌లలో పెట్టుబడి పెడుతున్నట్లుగా బాధితుడిని నమ్మించారు. దీంతో బాధితుడు స్కామర్లు అందించిన వివిధ ఖాతాలకు మొత్తం రూ. 72.55 లక్షలను వివిధ బ్యాంకుల ద్వారా బదిలీ చేశారు. అయితే మోసగాళ్లు తెలివిగా అతగాడిని నమ్మించేందుకు మే 14న బాధితుడి ఖాతాకు రూ.1.73 లక్షలు జమ చేశారు. ఇది ట్రేడింగ్ లాభం అని నమ్మించారు.

బాధితుడు తరువాత రూ.15 లక్షలు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అతని ఖాతాలో రూ.2.19 కోట్ల లాభాలు జమ అయ్యాయని అయితే దానిని యాక్సెస్ చేయడానికి, అతను 'పన్ను చెల్లింపు'గా రూ.43.93 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని మోసగాళ్లు చెప్పారు.అయితే ఇంత భారీ పన్ను డిమాండ్‌తో అప్రమత్తమైన బాధితుడు బేగంపేటలోని అధికారిక జెరోధా కార్యాలయానికి వెళ్ళి విచారించాడు. వారు ఈ యాప్, ట్రేడింగ్ ఖాతా రెండూ నకిలీవని చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతున్నాడు.

మోసపోయానని తెలుసుకున్న బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా మోసాన్ని నివేదించి, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+