రూ. 5000 నోటు పూర్తిగా రద్దు వార్తలు వైరల్, కేంద్రం నుంచి క్లారిటీ ఇదిగో..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ వార్త నిజమే మరో వార్త అబద్దమో తెలియడం లేదు.. ప్రతీ వార్తను నిజనిజాలు తెలుసుకోకుండా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలను వైరల్ చేశారు. ఆ తర్వాత అవి ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నెల నాటికి దశలవారీగా రద్దు చేయనున్నారనే వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.

Rs 500 note ban fake news 500 rupee ban 2026 fact check PIB fact check 500 note YouTube fake Rs 500 ban 500 currency ban rumor Indian currency fake news 2026 fake 500 note news 500 note ban hoax PIB India currency fact check viral fake 500 ban claim 2026 500 note update 500 2026 500 PIB 500 500 500 PIB 500 2026 PIB 500 RBI Reserve Bank of India 500 Rupee Note Currency Ban PIB Fact Check Fake News Social Media YouTube Government of India

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ.500 నోట్ల చలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఆ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీసింది. కేంద్రం అధికారిక ఫ్యాక్ట్ చెక్ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది.ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక 'ఎక్స్‌' ఖాతాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది. ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రూ.500 నోట్లు నిలుపుదల కావు. అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన, ఫేక్ వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఏదైనా ఇలాంటి వార్తలను నమ్మే ముందు గానీ, ఇతరులకు షేర్ చేసే ముందు గానీ, దాని నిజ నిర్థారణ అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్‌బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప, ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురికావద్దని హితవు పలికింది.కాగా 11 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పటికే 4.5 లక్షలకు పైగా వ్యూస్ దాటిపోయింది.

ఇదిలా ఉంటే ఆర్బీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వ్యవస్థలో ఇంకా రూ.2000 నోట్లు మూలుగుతున్నాయని తెలిపింది. నోట్ల రద్దు జరిగినా ఇంకా ప్రజల మధ్యనే రెండు వేల నోట్లు ఉన్నాయని తాజా రిపోర్టులో తెలిపింది. మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. రెండు వేల రూపాయిల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుని దాదాపు రెండు సంవత్సరాలు గడిచిపోయింది.

అయినప్పటికీ రెండు వేల రూపాయల నోట్ల రద్దు జరిగి రెండేళ్లు గడిచినా ఇంకా ప్రజల దగ్గర ఆర్బీఐ నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన గల రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+