హైదరాబాద్‌లోనూ ఆఫీస్ స్పేస్‌కు భలే డిమాండ్, ముంబై వీక్! 13% తగ్గిన ఖాళీ స్థలం
దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఉంది. ఈ ఏడాదిలో ఏడు మెట్రో నగరాల్లో 4.65 కోట్ల చ.అ. స్థలాన్నిలీజుకు తీసుకున్నారు. ఓ ఏడాదిలో ఇంతటి స్థాయిలో లీజుకు తీసుకోవడం ఇదే తొలిసారి. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం ఎక్కువని ప్రాపర్టీ కన్సల్టెన్సీ JLL ఇండియా నివేదిక వెల్లడిస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా కార్పోరేట్ సంస్థలు, ఐటీ, ఐటీఈఎస్ సంస్థల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో ఆఫీస్ కార్యాలయానికి భారీ డిమాండ్ ఏర్పడింది.

ఈ నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్
2018లో ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాలలో 3.32 కోట్ల చ.అ. స్థలం లీజుకు తీసుకున్నారు. ఇండియన్ ఆఫీస్ మార్కెట్ రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోందని, ప్రస్తుత ఏడాది 4.65 కోట్ల చ.అ. అద్దెకు తీసుకోగా, గరిష్టంగా 5.2 కోట్ల చ.అ. విస్తీర్ణం కలిగిన స్థలానికి డిమాండ్ నెలకొందని తెలిపింది. అలాగే సరఫరా కూడా 45 శాతం పెరిగి 5.16 కోట్ల చ.అ. ఉంది. గత ఏడాది ఇది 3.57 కోట్ల చ.అ.గా ఉంది. ఖాళీ స్థలాలు 13 శాతం మేర తగ్గాయి.

హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోనే 70 శాతం
భారత ఆఫీస్ మార్కెట్ కొత్త బెంచ్ మార్క్ ఏర్పాటు చేసింది. నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్ ప్రదేశంలోనే కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన వాటిలోను గరిష్టస్థాయి నమోదైంది. అద్దెకు తీసుకున్న ప్రదేశంలో ఐటీ, ఐటీఈఎస్ రంగం వాటా 42 శాతం కాగా, కోవర్కింగ్ ఆపరేటర్ల వాటా 14 శాతం. ఈ ఏడాదిలో నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్ స్పేస్‌లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల వాటానే 70 శాతం. గత ఏడాదితో పోలిస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నికరంగా అద్దెకు తీసుకున్న ఆఫీస్ స్పేస్ 2 శాతం తగ్గింది. సప్లై ఆశించిన స్థాయిలో లేకపోవడమే కారణం.

ఆఫీస్ స్పేస్‌లో బలమైన సెంటిమెంట్
భాగ్యనగరంలో 1.05 కోట్ల చ.అ. అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీ-NRCలో ఏడాది కాలంలో ఇక్కడ 1.1 కోట్ల చ.అ. స్పేస్‌ను కంపెనీలు అద్దెకు తీసుకున్నాయి. రీట్స్ అమలులోకి రావడంతో డెవలపర్లు అత్యంత నాణ్యమైన బిల్డింగ్స్‌ను నిర్మిస్తున్నారని, వీరిలో 10 ఆఫీస్ డెవలపర్లు ఇనిస్టిట్యూషనల్ భాగస్వామిలతో కలిసి నిర్మిస్తుండటంతో నాణ్యత ప్రమాణాలు రాజీపడకుండా నిర్మాణాలు ఉంటున్నాయని జేఎల్ఎల్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ అన్నారు. లీజుకు తీసుకున్న సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నైపుణ్యం, చురుకుదనం, ఉత్పాదకతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఆఫీస్ స్పేస్ రంగంలో పెట్టుబడుల సెంటిమెంట్ బలంగా ఉందని, అందుకే ఖాళీ ప్రదేశం తగ్గినట్లు చెప్పారు.

Click it and Unblock the Notifications