ఈ ఏడాది మొదటిసారి బంగారం ధరల భారీ పతనం; నేడు తెలుగు రాష్ట్రాల్లో ధరలిలా!!
బంగారం ధరలు పసిడి ప్రియులను ఒక ఆట ఆడుకుంటున్నాయి. నిన్నటికి నిన్న ఆల్ టైం కి చేరుకుని రికార్డు బద్దలు కొట్టిన బంగారం ధరలు, నేడు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇప్పటివరకు ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గరిష్టంగా పెరుగుతూ, కనిష్టంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు తొలిసారిగా బంగారం ధరలలో భారీ పతనం కనిపించింది.
నేడు దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 700 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 760 రూపాయల మేర తగ్గింది. ఇప్పటివరకు ఎప్పుడు బంగారం ధరలు తగ్గినా ఒక్కరోజులో గరిష్టంగా 300, 400 రూపాయలు మాత్రమే తగ్గిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఏకంగా 700 లకు పైగా తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది.

ఇక నేడు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 55,950గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,040 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,100 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61 వేల 190 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,040గా ప్రస్తుతం విక్రయించబడుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,000గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 61,090 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,950గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,040గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, తిరుపూరు, తిరునవ్వేలి, తిరుచ్చి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 56,500 ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications