ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్ను ఫైల్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు, పన్నులను ఎలా ఆదా చేసుకోవాలో చాలా మంది ఆలోచిస్తారు. అయితే మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ఉపయోగించే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి కొన్ని వస్తువులను కొనడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని మీకు తెలుసా ? మొబైల్ ఇంకా ల్యాప్‌టాప్‌లు మీ పన్నును ఎలా ఆదా చేస్తాయంటే..

కొత్త పన్ను విధానంలో ప్రయోజనం: సాధారణంగా పాత పన్ను విధానంలో మాత్రమే మినహాయింపులు లభిస్తాయని అనుకుంటారు. కానీ, కొత్త పన్ను విధానం కూడా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ లీజుల ఖర్చులను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. వీటిని అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కొన్ని కంపెనీలు 12 నెలల వాడిన తర్వాత వాటిని తిరిగి అమ్మేస్తాయి కూడా.
ఈ పన్ను ఆదా ప్రక్రియ సాధారణంగా ఫోన్ లేదా ల్యాప్‌టాప్ యజమాని (కంపెనీ), ఉద్యోగి ఇంకా లీజింగ్ కంపెనీ మధ్య ఒప్పందం ద్వారా జరుగుతుంది. లీజింగ్ కంపెనీ ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లను కొని యజమానులకు (కార్పొరేట్ క్లయింట్లకు) అద్దెకు ఇస్తుంది. ఆ కంపెనీ ఉద్యోగికి (అధికారిక లేదా పని ప్రయోజనాల కోసం) ఉపయోగించడానికి ఇస్తుంది. మింట్‌లోని ఒక నివేదిక ప్రకారం, అసెట్ లీజింగ్ కంపెనీ టార్టాయిస్ వ్యవస్థాపకుడు వర్ధన్ కోషల్ తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ 1 లేదా 2 సంవత్సరాల తర్వాత ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను డిస్కౌంట్‌కు కూడా అమ్మవచ్చు.
ఉదాహరణకు: మీరు రూ.30,000కి కొత్త మొబైల్ ఇంకా రూ.50,000కి ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి వాటిని మీ పనికి ఉపయోగిస్తే మీరు మీ పన్ను విధించే ఆదాయం నుండి మొత్తం రూ.80,000 తగ్గించుకోవచ్చు. ఒక కార్పొరేట్ క్లయింట్ (ఉదాహరణకు, ABC లిమిటెడ్) తన ఉద్యోగుల కోసం డివైజెస్ లీజింగ్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేసినప్పుడు లీజింగ్ కంపెనీ ఈ ప్రక్రియను ప్రారంభించి ఉద్యోగులకు డివైజెస్ లీజు కింద ఇస్తుంది.
ల్యాప్‌టాప్ మీ పన్నును ఎలా ఆదా చేస్తుందంటే : ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలకు రూ.1 లక్ష సంపాదిస్తూ, నెలకు రూ.10,000కు ఒక డివైజ్ (ల్యాప్‌టాప్/ఫోన్) అద్దెకు తీసుకుంటే అతని పన్ను రూ.1 లక్షకు బదులుగా రూ.90,000గా లెక్కించబడుతుంది. దీని ద్వారా పన్ను ఆదా ఉంటుంది. ముఖ్యంగా 30% పన్ను పరిధిలోకి వచ్చేవారికి ఈ సేవింగ్స్ నెలకు రూ.3,000 లేదా సంవత్సరానికి రూ.36,000 ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బిల్లు మీ పేరు మీద లేదా మీ వ్యాపారం పేరుతో ఉండాలి. అలాగే ఈ వస్తువులను పర్సనల్ ఉపయోగం కంటే వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించాలి.
ఒక డివైజ్ ధర రూ.1.1 లక్షలు అయితే ఉద్యోగి ప్రతి నెలా రూ.10,000 చొప్పున 12 నెలల్లో చెల్లిస్తే (మొత్తం రూ.1.2 లక్షలు), అతను పన్ను ప్రయోజనాల ద్వారా రూ.36,000 ఆదా చేయొచ్చు. లీజు చివరిలో అతను డివైజ్ రూ.6,000కు కొనుగోలు చేయాలని అనుకుంటే, అతని మొత్తం ఖర్చు రూ.90,000 అవుతుంది. ఇది నేరుగా కొనుగోలు చేయడంపై రూ.20,000 అదనపు ప్రయోజనం అందిస్తుంది.


Click it and Unblock the Notifications