Tata tech IPO allotment: ఇలా చెక్ చేయండి..!!
ముంబై: ఈ వారం మొత్తం కూడా స్టాక్ మార్కెట్‌లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సందడి కనిపించింది. ఏకంగా అయిదు ఐపీఓలు ఒకే తేదీన మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చాయి. లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐపీఓను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఆరుకు చేరుతుంది.
టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీ, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్ఎంఈ సెగ్మెంట్‌లో రాకింగ్ డీల్స్ సర్కులర్ ఎకానమీ లిమిటెడ్.. తమ పబ్లిక్ ఇష్యూలను జారీ చేశాయి. అవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ఓపెన్ అయినవే. 24వ తేదీన క్లోజ్ అయ్యాయి.

ఈ మూడు రోజుల వ్యవధిలో ఈ అయిదు ఐపీఓలు రాబట్టుకున్న ఇన్వెస్ట్‌మెంట్ విలువ.. 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. ఇదో రికార్డు. పబ్లిష్ ఇష్యూలను జారీ చేయడం ద్వారా ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులను సమీకరించిన మరో ఐపీఓలు ఈ మధ్యకాలంలో లేవు.
మూడు రెగ్యులర్ పబ్లిక్ ఇష్యుల్లో టాటా టెక్నాలజీస్ టాప్‌లో నిలిచింది. ఇష్యూ చేసిన వేల్యూ కంటే 69.43 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిందీ సంస్థ. దీని విలువ 1.56 లక్షల కోట్ల రూపాయలు. 4.5 కోట్ల పబ్లిక్ ఇష్యూలను జారీ చేయగా 312 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి.
టాటా టెక్‌పై ప్రజల్లో ఉన్న బలమైన విశ్వాసం, 19 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఐపీఓను జారీ చేయడం దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. పబ్లిక్ ఇష్యూ చివరి రోజు టాటా టెక్నాలజీస్ గ్రే మార్కెట్ ప్రీమియం 375 రూపాయలుగా నమోదైంది. అంటే- మనం కొన్న ఒక్క షేర్ మొత్తానికి అదనంగా 375 రూపాయలతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇది లిస్టింగ్ అవుతుందనేది మార్కెట్ వర్గాల అంచనా.
దీనితో- ఇక అందరి కళ్లూ బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మీద నిలిచాయి. లిస్టింగ్ నాడు ఎంత మొత్తాన్ని రిటర్న్ ఇస్తుందనేది ఉత్కంఠతను రేపుతోంది. ఈ నెల 30వ తేదీన షేర్లు అలాట్ అవుతాయి. డిసెంబర్ 1వ తేదీన రిఫండ్ ఉంటుంది. షేర్లు అలాట్ కానివారికి డిసెంబర్ 1వ తేదీ నాటికి ఆ మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. అదే నెల 5వ తేదీన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి.
టాటా టెక్ షేర్లు తమకు అలాట్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అధికారిక వెబ్ సైట్ https://www.bseindia.com/investors/appli_check.aspx ను సందర్శించవచ్చు. అప్లికేషన్ లేదా పాన్ కార్డ్ నంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. లేదా https://linkintime.co.in/mipo/ipoallotment.html లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా అలాట్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications