మన చుట్టూ చాలా మంది రూ. 25,000-రూ. 30,000 జీతం తీసుకుంటూ, ప్రతి నెలా ఖర్చులతోనే జీవితం గడుపుతున్నారు. వాళ్ళకి సొంత ఇంటి కల ఉంటుంది. కానీ ఈ జీతంతో కలను నిజం చేసుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. ఎంత పెద్ద కల కైనా సరైన ప్రణాళికతో సరైన పెట్టుబడితో సాధించొచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఎంత జీతం వస్తుందో కాదు, మీరు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు, దానిని ఎలా ప్రణాళికలో పెట్టుకుంటున్నారు అన్నదే ముఖ్యం. కానీ అదే జీతంలో కొంత భాగాన్ని సేవింగ్స్‌గా పెట్టి, దానిని సరైన దిశలో మళ్లిస్తే, 10-15 సంవత్సరాల తర్వాత జీవితం మొత్తం మారిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు.
బిజినెస్ కోచ్ దీపక్ వాఢ్వా తన లింక్డ్ఇన్‌లో "రూ. 25,000 వేతనంతో ఫార్ట్యూనర్ కార్, ఇల్లు కొనుకోవచ్చు ? వినడానికి అసాధ్యంగా అనిపించవచ్చు, కానీ గణితం వేరే చెబుతుంది అని రాశారు. వాఢ్వా చెప్పిన ప్లాన్ చాలా సింపుల్ చిన్న, క్రమంగా పెట్టుబడులు చేసి, ఓర్పు కలిగి ఉంటే, మీరు పెద్ద ఫలితాన్ని పొందవచ్చు.

చాలామంది డబ్బు లేక పెట్టుబడులు పెట్టలేమని అనుకుంటారు. కానీ వాస్తవానికి, వారు 'డబ్బు మిగిలితే సేవ్ చేస్తాం' అనే ఆలోచనతోనే విఫలమవుతారు. విజయం సాధించే వారు మాత్రం మొదట సేవ్ చేసి, తర్వాత మిగిలినదాన్ని ఖర్చు చేస్తారు. ఇక్కడ వాఢ్వా చెప్పినట్టు ఒక వ్యక్తి తన రూ. 25,000 వేతనం నుంచి ప్రతి నెలలో రూ. 5,000 SIP తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ప్రతి సంవత్సరం ఈ SIP మొత్తాన్ని 20% పెంచుతూ కొనసాగించాలి. ఈ విధంగా 15 సంవత్సరాలు క్రమంగా పెట్టుబడులు పెంచితే, మొత్తం రూ. 1.5 కోట్ల పోర్ట్‌ఫోలియో ఏర్పడుతుంది. అంటే 25వేల జీతంలో నెలకు కేవలం రూ. 5,000 సేవ్ చేయడం జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఆ తర్వాత, ఈ మొత్తం SWP (సిస్టమాటిక్ విత్ డ్రాల్ ప్లాన్)లోకి మార్చితే, వచ్చే 30 సంవత్సరాల పాటు నెలకు సుమారు రూ. 2 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. అంటే, చిన్న మొత్తంతో సక్రమంగా, క్రమంగా పెట్టుబడులు చేస్తూ, కాలం మీద ఆధారపడి పెద్ద లక్ష్యాలను సాధించడం సాధ్యమే అని ఆయన చెప్పుతున్నారు. అంటే, క్రమంగా పెట్టుబడి పెంచడం వలన, ఫార్ట్యూనర్ EMIs, ఇల్లు EMIలు చెల్లించడం సాధ్యమవుతుంది.
వాఢ్వా చెప్పేది, పెట్టుబడులు ఎక్కువ కాలం వదిలితే, వాటి పై లాభం కూడా పెరుగుతుంది. దీన్ని కంపౌండింగ్ అంటారు. క్రమానుగుణంగా SIP పెంచితే, తర్వాత SWP ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఇది గెట్-రిచ్-క్విక్ ప్లాన్ కాదు; క్రమశిక్షణ + కంపౌండింగ్ శక్తి అని అన్నారు. వాఢ్వా చెప్పిన ఈ ప్లాన్ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే పెద్ద సంపద సృష్టించడానికి పెద్ద జీతం అవసరం లేదు. అవసరమైనది క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి, ఓర్పు మాత్రమే.
ఇప్పటి నుంచైనా ప్రతి నెలా రూ. 5,000ను SIPలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. ధనం సృష్టించడంలో ఓర్పే ప్రధాన విషయం. అసలు సవాలు పెద్ద కొనుగోలు కాదు, సమయంతో అవసరమైన మొత్తం సృష్టించడం. వాఢ్వా చెప్పినట్టు "ప్రశ్న 'నాకు స్థోమత ఉందా?' కాదు, 'నేను దీన్ని సృష్టించడానికి ఓర్పుగా ఉన్నానా?'" అని అలోచించాలి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications