భారతదేశపు యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతం వివాదాలు చుట్టుముట్టాయి. ఆమె యూట్యూబ్ కంటెంట్ పై వార్తల్లో నిలవలేదు కానీ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీటిని నిజంగా ఎవరు అంత ఈజీగా నమ్మలేరు కూడా. అవును, హర్యానాలోని హిసార్ నివాసి అయిన జ్యోతి మల్హోత్రా ఒక పాకిస్తానీ గూఢచారి (ISI స్పై ఏజెంట్). భారతదేశ నిఘా సమాచారాన్ని పాకిస్తాన్ (పాకిస్తాన్ ISI)కి ఇచ్చినందుకు జ్యోతి ఎంత డబ్బు సంపాదించింది, ఈ మొత్తం కోట్లలో ఉంటుందా అని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి...

అసలు విషయం ఏంటంటే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత ఓ ప్రశ్న ఇప్పుడు అందరికి తట్టుతుంది. అన్నింటికంటే పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఒక గూఢచారికి స్పై చేసినందుకు ఎంత డబ్బు చెల్లిస్తుంది..? అసలు జ్యోతి మల్హోత్రా లగ్జరీ లైఫ్ స్టయిల్ సోషల్ మీడియాలో హై లెట్ కావడం వల్లే ఈ ప్రశ్న మొదలైంది.
జ్యోతి మల్హోత్రా గురించి ఇప్పటివరకు వెలువడిన సమాచారం ప్రకారం, 2020 సంవత్సరం వరకు జ్యోతి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత యూట్యూబర్‌గా మారింది. ఈ సమయంలో జ్యోతికి పాకిస్తాన్ గూఢచారులతో పరిచయం ఏర్పడింది అలాగే నిఘా సమాచారాన్ని లీక్ చేయడం ప్రారంభించింది.
గూఢచర్యం కోసం ISI ఎంత డబ్బు చెల్లిస్తుందంటే : రిపోర్ట్స్ ప్రకారం ISI మొదట ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, నిఘా సమాచారాన్ని ఎక్కడి నుండి సేకరించారో దాని ప్రకారం డబ్బు నిర్ణయిస్తుంది. ఉదాహరణకు థాయిలాండ్, మయన్మార్ వంటి దేశాలకు తక్కువ డబ్బు ఇస్తారు. అలాగే భారతదేశం, అమెరికా వంటి దేశాల నుండి నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ISI ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది. అంటే ఈ దేశాలలో పనిచేసే ఏజెంట్లకు ISI ఎక్కువ డబ్బు చెల్లిస్తుంది. గూఢచారులకు డబ్బు ఇవ్వడానికి ISIకి బడ్జెట్ కేటాయింపులు కూడా ఉంటాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇందుకు 5 బిలియన్లు కేటాయిస్తుంది. అంటే మన దేశ రూపాయి ప్రకారం 50 లక్షలు. ఐఎస్ఐ ఈ డబ్బును ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఇంకా గూఢచారులకు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం ISI కింద 4 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
పాకిస్తాన్ నుంచి ఒక గూఢచారికి ఎంత వస్తుందంటే : పాకిస్తాన్ ప్రభుత్వం లేదా నిఘా సంస్థ ISI దీనిపై ఎప్పుడూ ఎలాంటి సమాచారం చెప్పలేదు, కానీ పట్టుబడిన గూఢచారులు చేసిన వెల్లడి ప్రకారం, పాకిస్తాన్ నిఘా సంస్థ సమాచారం ఆధారంగా గూఢచారులకు డబ్బు చెల్లిస్తుంది.
పంజాబ్ పోలీసులు ఫిబ్రవరి 2025లో అమృత్‌సర్‌లో ఓ ISI ఏజెంట్‌ను అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత అమృత్‌సర్ గ్రామీణ SSP విలేకరుల సమావేశం నిర్వహించారు. చిన్న సమాచారానికి ఐఎస్ఐ 5 వేలు, పెద్ద సమాచారానికి 10 వేలు ఇస్తుందని ఎస్ఎస్పీ తెలిపారు.
2011లో ఒక అమెరికన్ అధికారి పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. గూఢచర్యం కోసం పాకిస్తాన్ తనకు రూ. 3 కోట్లు ఇచ్చిందని ఆ అధికారి వెల్లడించాడు. దీని బట్టి చూస్తే పాకిస్తాన్ నిఘా సంస్థ గూఢచారులకు వారి ప్రదేశం ఇంకా సమాచారం ఆధారంగా డబ్బు చెల్లిస్తుంది. కానీ జ్యోతి మల్హోత్రా కేసులో ఆమెకు ఎంత డబ్బు ఇవ్వబడిందనే సమాచారం ఇప్పటివరకు వెల్లడి కాలేదు.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications