యాత్ర ఆన్‌లైన్ IPO సబ్‌స్క్రిప్షన్ కోసం శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 20 బుధవారం ముగుస్తుంది. కంపెనీ ఈక్విటీ షేరుకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.135 నుంచి రూ. 142 మధ్య ధరను నిర్ణయించింది. Yatra Online IPO సెప్టెంబర్ 14, గురువారం నాడు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.348 కోట్లను సేకరించింది. Yatra Online IPO పబ్లిక్ ఇష్యూలో 75% కంటే తక్కువ కాకుండా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB), 15% కంటే ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసింది. 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.
యాత్ర IPO లాట్ పరిమాణం 105 ఈక్విటీ షేర్లుగా ఉంది. 56.53 P/E నిష్పత్తితో వస్తోంది. BSE డేటా ప్రకారం ఉదయం 11:03 గంటల వరకు 19% సబ్‌స్క్రైబ్ అయింది. యాత్రా ఆన్‌లైన్ IPOలో రూ.602 కోట్ల విలువైన షేర్ల తాజా జారీ చేయనున్నారు. ప్రమోటర్, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారు ద్వారా 12.2 మిలియన్ షేర్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేయనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే డబ్బులను వ్యూహాత్మక పెట్టుబడులు, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఖర్చు చేయనున్నారు.

SBI క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, DAM క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్, IIFL సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉన్నాయి. యాత్రా ఆన్‌లైన్ దేశీయంగా, అంతర్జాతీయంగా అలాగే దేశంలోనే ప్రయాణించే కస్టమర్ల డిమాండ్‌లను తీర్చడానికి ప్రయాణానికి సంబంధించిన విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. యాత్ర వెబ్ సైట్, మొబైల్ యాప్ లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పర్యటక ప్రదేశాల్లో హోటల్ రూమ్ లు కూడా బుక్ చేసుకోవచ్చు.
అయితే ఈ రంగంలో అనేక కంపెనీలు ఉన్నాయి. లిస్టెడ్ స్పెస్ లో ఈస్ మై ట్రిప్, మిగతా కంపెనీలు ఉన్నాయి. యాత్ర కంపెనీ కొవిడ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. అప్పుడు విమానాశ్రాయాలు, పర్యటక ప్రాంతాలు మూసి ఉన్నాయి. Yatra IPO GMP ఈరోజు లేదా గ్రే మార్కెట్ ప్రీమియం రూ.0 గా ఉంది. అంటే గ్రేమార్కట్ లో ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.142 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications