సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై ‘AI' దెబ్బ.. మధ్యతరగతి కుటుంబాలు మారకపోతే కష్టమే! నిపుణుల హెచ్చరిక!

గడిచిన మూడు దశాబ్దాలుగా భారతదేశంలో మధ్యతరగతి (Middle Class) కుటుంబాల ఎదుగుదలకు ఐటీ రంగం (IT Sector) ఒక ప్రధాన ఇంజిన్‌లా పనిచేసింది. లక్షలాది మంది ఇంజనీర్లు గ్లోబల్ కంపెనీల సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను మెయింటెన్ చేస్తూ, కోడింగ్ రాస్తూ, టెస్టింగ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపారు. చైనా ప్రపంచానికి ఒక ఫ్యాక్టరీగా మారితే.. ఇండియా ప్రపంచానికి ఒక 'బ్యాక్ ఆఫీస్' గా అవతరించింది. ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించడం, ఏటా వచ్చే ఇంక్రిమెంట్లతో లైఫ్ సెట్ చేసుకోవడం అనేదే ఇప్పటివరకు ఒక సురక్షితమైన మార్గంగా ఉండేది.

కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఈ పాత సామాజిక ఒప్పందం , ఆర్థిక లాజిక్ పూర్తిగా బలహీనపడుతున్నాయి. ఈ డిజిటల్ విప్లవంలో మధ్యతరగతి కుటుంబాలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు తమ కెరీర్ , ఆర్థిక భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో కొన్ని కీలకమైన ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ (investment tips) ఇప్పుడు చూద్దాం.

How Indian Middle Class Should Adjust To AI Economy Job Market Investment Tips

తలకిందులు కానున్న హైరింగ్ పిరమిడ్!

భారతీయ ఐటీ రంగానికి గ్లోబల్ మార్కెట్‌లో అంత డిమాండ్ ఉండటానికి కారణం.. ఇక్కడ తక్కువ ఖర్చుతో వేలాది మంది ఇంజనీర్లు లభించడమే. అయితే, జెనరేటివ్ ఏఐ (Generative AI) ఇప్పుడు సరిగ్గా ఆ లేయర్ పైనే దెబ్బకొడుతోంది. గతంలో ఐదుగురు ఇంజనీర్లు చేసే కోడ్ మైగ్రేషన్, డాక్యుమెంటేషన్, టెస్టింగ్ వంటి పనులను.. ఇప్పుడు ఏఐ టూల్స్ సహాయంతో ఒకే ఒక్క అనుభవజ్ఞుడైన ఇంజనీర్ పూర్తి చేయగలుగుతున్నాడు. దీనివల్ల కంపెనీల్లో కొత్తవారిని తీసుకునే 'క్యాంపస్ ప్లేస్‌మెంట్' సిస్టమ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

పాత టెక్నాలజీ నమ్ముకుంటే ఉద్యోగాలు గోవిందా!

గతంలో బ్యాంకింగ్ రంగంలో 'కోబాల్' (COBOL) ప్రోగ్రామర్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్లు తాము ఎప్పటికీ ఇన్‌డిస్పెన్సిబుల్ (తప్పనిసరి) అని భ్రమపడ్డారు. కానీ ప్రపంచం కొత్త టెక్నాలజీ వైపు మారగానే వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతం బెంగళూరు లాంటి నగరాల్లో పాత లెగసీ టెక్నాలజీలను నమ్ముకుని లక్షల జీతాలు తీసుకుంటున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓరాకిల్ (Oracle) వంటి గ్లోబల్ జెయింట్స్ ఇప్పటికే అంతర్గత పునర్నిర్మాణం (Restructuring) పేరుతో ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి.

గూగుల్ స్టార్టప్స్ మెంటర్ శ్రీనాథ్ వి. ప్రకారం.. "పాశ్చాత్య దేశాలు డీప్ ప్రొడక్ట్ క్యాపబిలిటీని నిర్మిస్తే, ఇండియా కేవలం సర్వీస్ రంగానికే పరిమితమైంది. ప్రొడక్ట్స్ అనేవి కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటాయి, కానీ సర్వీసెస్ అనేవి కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారుతుంటాయి." ఏఐ వల్ల ఇప్పుడు ఈ సర్వీస్ బిజినెస్ మోడల్ కరిగిపోతోంది.

ఏఐ ఎకానమీలో మిడిల్ క్లాస్ పాటించాల్సిన 5 కీలక 'investment tips'..

  1. మీ నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టండి (Skill Investment): పాత పద్ధతిలో కేవలం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం కాకుండా.. సిస్టమ్స్ థింకింగ్, ఒరిజినల్ అబ్‌స్ట్రాక్షన్ (సొంత ఆలోచనలు) పెంచుకోవాలి. కేవలం టెక్నాలజీని నేర్చుకోవడం కాదు, దాన్ని ఏఐ తో కలిపి ఎలా వాడాలో (Prompt Engineering) నేర్చుకోవాలి.
  2. కాలేజీ బ్రోచర్లు చూసి మోసపోకండి: ఇప్పటికీ తల్లిదండ్రులు కాలేజీ బ్రోచర్లలో 'AI/ML' అని చూడగానే దాన్ని కొత్త జావా కోర్సులా భావించి పిల్లలను చేర్పిస్తున్నారు. కేవలం సర్టిఫికేషన్ల కోసం కాకుండా, ప్రాక్టికల్ ఎక్స్‌ప్లోరేషన్ , అడాప్టివ్ థింకింగ్ ఉన్న కోర్సులను ఎంచుకోవాలి.
  3. ఎమర్జెన్సీ ఫండ్ కచ్చితంగా ఉండాలి: ఐటీ రంగంలో ఎప్పుడు ఏ ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది కాబట్టి, ప్రతి ఉద్యోగి తమ కనీసం 6 నుండి 12 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్‌ రూపంలో లిక్విడ్ ఫండ్స్ లేదా ఎఫ్‌డీలలో దాచుకోవాలి.
  4. ఒకే రంగంపై ఆధారపడకండి (Diversify Career/Income): కేవలం ఐటీ జీతం పైనే ఆధారపడకుండా సైడ్ హసిల్స్ (Side Hustles) లేదా ఇతర రంగాల ద్వారా అదనపు ఆదాయ వనరులను సృష్టించుకోవడానికి ప్రయత్నించాలి.
  5. ఫైనాన్షియల్ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయండి: స్థిరమైన ఉద్యోగ భద్రత తగ్గుతున్నప్పుడు, మీ వ్యక్తిగత పెట్టుబడులను కేవలం రియల్ ఎస్టేట్ లాంటి ఇలిక్విడ్ అసెట్స్‌లో పెట్టకుండా.. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు , డెట్ ఫండ్స్ లలో డైవర్సిఫై చేయడం మంచిది.

పాత మోడల్ చుట్టూ నిర్మితమైన సమాజానికి, రాబోయే సరికొత్త ఏఐ విప్లవం ఎలాంటి మార్పులను తెస్తోందో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కానీ, ఈ మార్పును ముందుగానే గ్రహించి అలవాటు పడేవారే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడగలరు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+