దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు రెండింతలు పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. వివిధ కారణాలతో జూలై-సెప్టెంబర్ కాలంలో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయని వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి నుండి ఆర్థిక రికవరీ వేగవంతం కావడం, కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సన్నగిల్లడం, ఐటీ మరియు ఐటీ ఆధారిత రంగాల్లో నియామకాలు వేగంగా పెరగడం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పదిహేనేళ్ల కనిష్టానికి పడిపోవడం వంటి అంశాలు ఇళ్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా జూలై - సెప్టెంబర్ మధ్య 62,800 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొంది.
సగటు ధర చదరపు అడుగుకు రూ.5,600 నుండి రూ.5,760కి పెరిగినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో 2020 జూలై - సెప్టెంబర్ కాలంలో 1,650 హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే కాలంలో నాలుగు రెట్లు అధికంగా 6,735 యూనిట్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. మూడో త్రైమాసికంలో కొత్తగా ఏడు నగరాల్లో దాదాపు 64,560 యూనిట్లు ప్రారంభమైనట్లు వెల్లడించింది.

కోలుకుంటున్న నిర్మాణ రంగం
దేశంలోని టాప్ 7 నగరాల్లో ఈ ఏడాది జూలై నుండి సెప్టెంబర్ కాలంలో నమోదైన ఇళ్ల అమ్మకాలే కరోనా ప్రభావం నుండి నిర్మాణ రంగం కోలుకుంటోందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ గత ఏడాదితో పోలిస్తే 24,560 యూనిట్ల నుండి 29,520 యూనిట్లకు
పెరిగాయి. ఈ క్రమంలో గతంతో పోలిస్తే సేల్స్ వృద్ధిపరంగా హైదరాబాద్ 408 శాతంతో టాప్‌లో ఉంది. యూనిట్స్ పరంగా చూస్తే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ 20,965 యూనిట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఈ జూలై-సెప్టెంబర్ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 64,560 కొత్త యూనిట్ల ప్రారంభం జరిగింది. గత ఏడాది 32,530గా ఉన్నాయి. అయినప్పటికీ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. 2019లో ఈ నగరాల హౌజింగ్ సేల్స్ 2,61,358 యూనిట్లుగా ఉన్నట్లు తెలిపింది. కరోనాతో 2020లో అమ్మకాలు భారీగా క్షీణించాయి.

ఇళ్ల ధరలు పెరిగాయి
మొత్తం ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున మూడు శాతం పెరిగినట్లు అనరాక్ తెలిపింది. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గడం హౌజింగ్ సేల్స్ పెరగడానికి దోహదం చేసినట్లు అనరాక్ చైర్మన్ అనుజ్ పూరీ అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సైతం చాలామందిని సొంతింటి వైపు నడిపించిందని తెలిపారు. ఈ క్రమంలో పెద్ద ఇళ్లకు డిమాండ్ ఏర్పడిందని వివరించారు. వేగంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌తో కొనుగోలుదారులు రియాల్టీ సైట్లకు రావడం మళ్లీ పెరిగిందన్నారు.

ఏ నగరంలో ఎంత పెరిగాయంటే
బెంగళూరులో హౌసింగ్ సేల్స్ 58 శాతం పెరిగి 5400 యూనిట్ల నుండి 8550 యూనిట్లకు, పుణేలో వంద శాతం పెరిగి 4,850 యూనిట్ల నుండి 9,705 యూనిట్లకు, హైదరాబాద్‌లో 1,650 యూనిట్ల నుండి నాలుగు రెట్లు పెరిగి 6,735 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో రెండింతలు పెరిగి 1600 నుండి 3,405 యూనిట్లకు, కోల్‌కతాలో 99 శాతం పెరిగి 1,600 నుండి 3,220 యూనిట్లకు పెరిగాయి. ఢిల్లీలో 97 శాతం పెరిగి 5,200 నుండి 10,220 యూనిట్లకు, ముంబైలో 9,200 యూనిట్ల నుండి 20,965 యూనిట్లకు పెరిగాయి.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications