భారత్‌లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోనే గృహ రుణభారం ఎక్కువగా ఉందని ఓ సర్వే మంగళవారం తెలిపింది. 2013-2019 ఆల్ ఇండియా డెబిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే(AIDIS) డేటాను ఉదహరిస్తూ డొమెస్టిక్ ఏజెన్సీ ఇండియా రేటింగ్ గృహ రుణ భారానికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. మిగతా భారత్‌తో పోలిస్తే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో దక్షిణాదిలోనే గృహ రుణ భారం ఎక్కువగా ఉందని పేర్కొంది. 2019లో తెలంగాణ 67.2 శాతంతో గ్రామీణ కుటుంబాల్లో అత్యధిక శాతం అప్పులు కలిగి ఉంది. అదే సమయంలో నాగాలాండ్ రూరల్ గృహ రుణభారం కనిష్టంగా 6.6 శాతం మాత్రమే ఉంది. ఇక పట్టణ ప్రాంత రుణ భారం విషయానికి వస్తే కేరళలో ఎక్కువగా ఉంది. 47.8 శాతంతో అర్బన్ గృహ రుణంలో కేరళకు ఎక్కువగా ఉంది. మేఘాలయలో గృహ రుణభారం కేవలం 5.1 శాతం మాత్రమే ఉంది. తలసరి ఆదాయంలోను దక్షిణాది రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాయి.

అధిక గృహ రుణ భారం
ప్రధాన రాష్ట్రాలలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక రుణ భారం ఉన్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఉండగా, అత్యధిక రుణ భారం ఉన్న పట్టణ ప్రాంత రాష్ట్రంగా చత్తీస్‌గఢ్ నిలిచింది. దేశంలోని ఇతర ప్రాంతాలు లేదా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రామీణ, పట్టణ గృహ రుణ భారం అధికంగా ఉండటం ప్రతికూలంగా కనిపిస్తోంది. గృహ రుణాల సగటును, గృహ ఆస్తుల సగటు విలువలను, రుణ-ఆస్తుల నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటారు.

భారత్ కంటే ఎక్కువ
కేరళను మినహాయించి, దక్షిణాది రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ గృహాలలో అధిక అప్పులు ఉన్నప్పటికీ, ప్రతి అప్పు ఉన్న కుటుంబానికి అధిక సగటు అప్పు లేదా ప్రతి గ్రామీణ కుటుంబానికి అధిక సగటు ఆస్తుల్లో ప్రతిబింబించలేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. కర్నాటక డెబిట్ టు అసెట్ రేషియో భారత్ సగటు కంటే ఎక్కువగా ఉంది. అర్బన్, రూరల్‌లోను అలాగే ఉంది.

జీడీపీలో 37.9 శాతం
ఇక, దక్షిణాది రాష్ట్రాలలో అధిక శాతం కుటుంబాలు అప్పులపాలు కావడం మాత్రమే కాదు, వారు మరింత పరపతి పొందారని ఈ నివేదిక సూచిస్తోంది. 2020-21 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో గృహ రుణ భారం జీడీపీలో 37.9 శాతం ఉంది. 2019-20లో నాలుగో త్రైమాసికంలో ఈ నిష్పత్తి 33.8 శాతంగా ఉంది.
అధిక అప్పులు, సేవలను తీసుకునే సామర్థ్యం గృహాల ఆస్తి/ఆదాయం ప్రొఫైల్‌తో ముడివడి ఉందని, తలసరి ఆదాయం అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోను జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని ఇండియా రేటింగ్స్ గుర్తు చేసింది. అధిక తలసరి ఆదాయం ఉండటం వల్ల ఎక్కువ ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని (దక్షిణాది) కుటుంబాలలో అప్పులు ఎక్కువ అయి ఉంటాయని అభిప్రాయపడింది.
గత ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి కారణంగా గృహ రుణాలు మరింత పెరిగాయని, ఆర్బీఐ డేటా ఇప్పటికే జీడీపీ నిష్పత్తిలో గృహ రుణ వాటా Q4FY20లో 33.8 శాతంగా ఉన్నదని, FY21 మూడో త్రైమాసికానికి 37.9 శాతానికి పెరిగిందని తెలిపింది.
More From GoodReturns

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications