ముంబై: దేశీయ హాస్పిటాలిటీ సెక్టార్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఓయో సంస్థ.. పబ్లిక్ ఇష్యూకు రానుంది. దీనికి సంబంధించిన సన్నాహకాలను మొదలు పెట్టింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ చేయడానికి సన్నద్ధం కావాలంటూ ఓయో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచించినట్లు ఆ కంపెనీ ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి అభిషేక్ గుప్తా తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఐపీఓను జారీ చేయడానికి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవంటూ కంపెనీ ఆడిట్ కమిటీ నివేదక ఇచ్చిందని, దీనికి అనుగుణంగా తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓయో రూమ్స్ పూర్తి స్థాయిలో భర్తీ కావట్లేదు. లాక్‌డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఓయో రూమ్‌లను అద్దెకు తీసుకునే వారి సంఖ్య క్షీణించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడంతో ఓయో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది.

ఇక థర్డ్‌వేవ్ ముప్పు కూడా తప్పకపోవచ్చంటూ నిపుణుల నుంచి హెచ్చరికలు జారీ అవుతోన్నాయి. ఈ పరిణామాల మధ్య పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు. దేశీయ స్టాక్ మార్కెట్‌లో పలు కొత్త కంపెనీలు, స్టార్టప్‌లు ఐపీఓలను జారీ చేస్తూ వస్తోన్నాయి. ఆన్‌లైన్ ద్వారా వినియోగదారుల నుంచి బుకింగ్‌లను స్వీకరించే దాదాపు అన్ని సంస్థలు ఐపీఓల సెక్టార్‌లో ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పటికే పేటీఎం ఐపీఓను ఇష్యూ చేసింది. జొమోటో ఐపీఓను జారీ చేసింది. ఆన్‌లైన్ కార్ల బుకింగ్ కంపెనీల ఓలా ఈ జాబితాలో ఉంది.
అదే క్రమంలో హాస్పిటాలిటీ సెక్టార్‌కు చెందిన ఐపీఓకు సిద్దపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లో అడుగు పెట్టే అవకాశాలు లేకపోలేదని సీఎఫ్ఓ అభిషేక్ గుప్తా చెప్పుకొచ్చారు. కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోన్నామని, రెండు వారాలుగా వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయని అన్నారు. ఐపీఓను జారీ చేసే క్రమంలో తొలుత ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుందని, ఈ దిశగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications