ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్స్ ఇండియా తన "హోండా ఫ్రమ్ హోమ్" ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించింది. ఏప్రిల్ 2020 లో ప్రవేశపెట్టిన డిజిటల్ విధానంలో మొదటి దశలో బుకింగ్ సదుపాయాన్ని మాత్రమే అందించింది. అయితే ఇప్పుడు హోండా ఫ్రమ్ హోమ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుండి హోండా అమ్మకాలు ప్రారంభించడంతో వినియోగదారులకు కొనుగోలు సులభతరంగా మారింది. హాయిగా ఇంట్లో కూర్చునే కార్ ను ఏ సమయంలోనైనా కొనుగోలు చేసే అవకాశం కల్పించింది హోండా .

హోండా ఫ్రమ్ హోం.. సులభంగా ఇంటి నుండే కార్ కొనుగోలు
హోండా ఫ్రమ్ హోం ద్వారా ఇప్పుడు క్రింద పేర్కొన్న ఆరు దశల్లో మొత్తం కారు కొనుగోలుకు సంబంధించిన పూర్తి ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. హోండా ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా మొదట ఇష్టమైన హోండా కారును ఎంచుకుంటే, ఆ తర్వాత దానికి సంబంధించిన ఆఫర్లను గురించి తెలుసుకోవచ్చు. మూడవ దశలో కొటేషన్ చూసి, ఫైనాన్స్ ఎంపికలను కూడా నిర్ణయించుకోవచ్చు. ఆ తర్వాత డెలివరీ ఎంపికలను కూడా నిర్ధారించి ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. హోండా ఫ్రమ్ హోమ్ ద్వారా వినియోగదారులకు ఈ వెసులుబాటును కల్పిస్తోంది హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ .

సురక్షిత కార్ల కొనుగోలు అనుభవం .. డీలర్లతో సంబంధం లేకుండా నేరుగా
తన కస్టమర్ల కోసం సురక్షితంగా కార్లు కొనుగోలు చేసే అనుభవాన్ని అందిస్తోంది . కస్టమర్లు డీలర్లను సంప్రదించాల్సిన అవసరం లేకుండా నేరుగా కారు కొనుగోలు ప్రక్రియలో ఆరు సులభమైన విధానాల్లో ఇంటినుండి పూర్తి చేసేలా హోండా రూపొందించింది. హోండా కార్స్ ఇండియా 2020 సెప్టెంబర్ లో ప్రవేశపెట్టిన హోండా షోరూం 'హోండా ఫ్రమ్ హోమ్' ఆన్లైన్ ప్లాట్ ఫామ్ తో ఇప్పుడు హోండా కి సంబంధించిన అన్ని మోడల్స్ ను అమ్మకాలకుఅనుసంధానించింది.

హోండా అన్ని మోడల్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో అమ్మకాలకు రెడీ
ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ, ఫోర్త్ జెన్ హోండా సిటీ, హోండా అమేజ్ , జాజ్ ఫేస్ లిఫ్ట్ , డబ్ల్యూఆర్ వి ఫేస్ లిఫ్ట్ , హోండా సివిక్ మరియు సిఆర్ వి లతో పాటు అన్ని మోడల్స్ ను హోండా ఇప్పుడు కస్టమర్లకు హోండా ఫ్రమ్ హోమ్ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ద్వారా అందిస్తుంది. ఇక వీటి కొనుగోలుకు సంబంధించిన అన్ని సమగ్ర వివరాలను హోండా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది.
కరోనా కారణంగా చాలా వరకు దిగ్గజ సంస్థలు తమ వ్యాపారాన్ని ఆన్ లైన్ లో విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల కంపెనీ హోండా కూడా ఆన్ లైన్ లో కార్ల అమ్మకాన్ని ప్రారంభించింది .


Click it and Unblock the Notifications