అణు యుద్ధం చేస్తే ఎవరూ గెలవలేం.. ఆపేద్దామన్న అగ్రదేశాల నేతలు..

Historic Trump-Xi-Putin Summit: ప్రపంచ దౌత్య చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు సందర్భంగా గురువారం (నవంబర్ 19, 2026) చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఉన్న కైలిన్ విల్లా (Kylin Villa) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా ముఖాముఖి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.

సుమారు 90 నిమిషాల పాటు జరిగిన ఈ అత్యున్నత స్థాయి చర్చల అనంతరం, ముగ్గురు దేశాధినేతలు శాంతి దిశగా రష్యా-చైనా-అమెరికా దేశాధినేతల ప్రకటన పేరిట నాలుగు కీలక అంశాలతో కూడిన సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సదస్సుకు విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినందుకు రష్యా, అమెరికా అధ్యక్షులు చైనాను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సంయుక్త ప్రకటనలో ప్రధానంగా నాలుగు కీలక నిబద్ధతలను ప్రస్తావించారు.

Trump Xi Putin Summit Declaration Toward Peace Trump Putin Xi Meeting US China Russia Agreement Global Peace Declaration Four Major Pledges Nuclear Risk Reduction UN Reforms Oil Supply Agreement International Criminal Court

మొదటిది ఏంటంటే ఐక్యరాజ్యసమితి (UN) సంస్కరణలు.. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనాలు అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ అనే ప్రాథమిక కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేలా ఐరాసలో సంస్కరణలు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి.

రెండవది ఇంధన భద్రత.. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఇంధన ప్రవాహాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, అన్ని దేశాల ప్రయోజనం కోసం శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి, సరఫరాను పెంచడానికి మూడు దేశాలు అంగీకరించాయి.

Also Read

మూడవది అంతర్జాతీయ న్యాయ పరిధి.. ప్రభుత్వ సమ్మతి సూత్రం మరియు ప్రభుత్వ అధికారుల రక్షణలను (Immunities) గౌరవించాలని పేర్కొంటూ, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) మరియు ఇతర సారూప్య సంస్థలు తమ అధికార పరిధిని దుర్వినియోగం చేయకూడదని నాయకులు స్పష్టం చేశారు. పుతిన్‌పై ఐసీసీ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో ఈ అంశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

నాల్గవది అత్యంత కీలకమైనది అణు ప్రమాదాల తగ్గింపు.. అణు యుద్ధంలో ఎవరూ గెలవలేరు, దానిని ఎన్నటికీ చేయకూడదు అనే సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ, అణు ప్రమాదాలను తగ్గించడం, అణ్వాయుధ వ్యాప్తి నివారణపై చర్చలు జరపడానికి మూడు దేశాలు అంగీకరించాయి.

ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మనం నిజంగా చరిత్ర సృష్టిస్తున్నాం. భూమిపై అణ్వాయుధాల నిల్వలను తగ్గించడం, వాటి వినియోగ ప్రమాదాన్ని నివారించడంపై చర్చించడానికి అమెరికా, రష్యా, చైనాలు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాయని అభివర్ణించారు. ఫిబ్రవరిలో 'న్యూ స్టార్ట్' (New START) ఒప్పందం గడువు ముగిసిన నేపథ్యంలో చైనాను కూడా అణు నియంత్రణ చర్చల్లోకి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. మరోవైపు ప్రధాన శక్తుల మధ్య సహకారం ప్రపంచ శాంతికి అత్యంత కీలకమని షీ జిన్‌పింగ్ పేర్కొనగా, నిర్మాణాత్మక సహకారం ద్వారా ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేయవచ్చని పుతిన్ అన్నారు.

త్రైపాక్షిక సదస్సుకు ముందు ట్రంప్, షీ జిన్‌పింగ్ విడిగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి వ్యూహాత్మక స్థిరత్వం, కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణలపై చర్చించారు. అలాగే వచ్చే నెల మియామీలో జరగనున్న జీ20 (G20) సదస్సుకు హాజరయ్యే విషయాన్ని పరిశీలిస్తానని పుతిన్ సంకేతాలిచ్చారు. అయితే, ఈ త్రైపాక్షిక సంయుక్త ప్రకటనలో కొనసాగుతున్న ఉక్రెయిన్ మరియు ఇరాన్ యుద్ధాల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం అంతర్జాతీయ విశ్లేషకులలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+