ఇదేందయ్యా ట్రంప్.. అమెరికా–చైనా ట్రేడ్ డీల్.. 60 బిలియన్ డాలర్ల వస్తువులపై టారిఫ్ తగ్గింపు..

US-China Tariff Agreement: ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలకమైన ముందడుగు పడింది. తమ మధ్య ద్వైపాక్షికంగా జరిగే సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై మరింత అనుకూలమైన సుంకాల విధానాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి.

ఎనిమిదవ రౌండ్ ఆర్థిక, వాణిజ్య సంప్రదింపుల అనంతరం చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించగా.. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ సైతం నూతనంగా ఏర్పాటైన 'యూఎస్-చైనా బోర్డ్ ఆఫ్ ట్రేడ్' చట్రంలో భాగంగా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. 2024 నాటి వాణిజ్య గణాంకాల ఆధారంగా రూపొందిన ఈ ఒప్పందంలో భాగంగా.. ఒక్కో దేశం అవతలి దేశం నుండి దిగుమతి చేసుకునే సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన సున్నితత్వం లేని ఉత్పత్తులకు ఈ ప్రత్యేక మినహాయింపులు కల్పించనున్నాయి.

US China tariff deal US China trade agreement 60 billion goods tariff reductions US China trade war Chinese toys agricultural products US coal exports medical devices household appliances tariff relief trade negotiations Trump Xi trade deal US imports from China China imports from US US China 60

ఈ నూతన ఏర్పాటు ప్రకారం ఆయా వస్తువులపై ఉన్న అన్ని దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు కాకపోయినా.. గత వాణిజ్య వివాదాల సమయంలో విధించిన అదనపు ప్రతీకార సుంకాల నుండి 90 శాతానికి పైగా ఉత్పత్తులకు ఊరట లభిస్తుంది. వాటికి సాధారణ 'అత్యంత ప్రాధాన్య దేశం' (MFN) సుంకాల రేట్లు వర్తిస్తాయి. అమెరికా రాయితీలు ఇవ్వనున్న చైనా ఉత్పత్తుల జాబితాలో బొమ్మలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటితో పాటు పిల్లల సైకిళ్లు, వంటగది సామాగ్రి, గృహోపకరణాలు, దుప్పట్లు, పిల్లల కార్ సీట్లు, పండుగ అలంకరణ వస్తువులకు అమెరికా సుంకాల ఉపశమనం కల్పిస్తుంది. తగ్గిన సుంకాల వల్ల అమెరికన్ రిటైలర్లకు దిగుమతి ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ఆదా వినియోగదారులకు ఏ మేరకు బదిలీ అవుతుందనేది తుది రేట్లపై ఆధారపడి ఉంటుంది.

Also Read

మరోవైపు చైనా ప్రకటించిన సుంకాల సడలింపు జాబితా ప్రధానంగా అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించింది. మొక్కజొన్న, గోధుమ, జొన్న, మాంసం, పాల ఉత్పత్తులు, సముద్రపు ఆహారం, కలప, సౌందర్య సాధనాలు, వైద్య పరికరాలతో పాటు బొగ్గుకు కూడా చైనా ఈ రాయితీలను వర్తింపజేయనుంది. అంతేకాకుండా, 2027, 2028 సంవత్సరాల్లో చైనా ఏటా 10 మిలియన్ మెట్రిక్ టన్నుల అమెరికా బొగ్గును కొనుగోలు చేసేందుకు విడిగా అంగీకరించింది. అయితే చైనాకు అమెరికా ఎగుమతి చేసే అత్యంత కీలకమైన వ్యవసాయ ఉత్పత్తి 'సోయాబీన్'ను, అలాగే చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG)లను ఈ జాబితా నుండి మినహాయించడం అమెరికన్ రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

అయితే ఈ సుంకాల తగ్గింపులు ఇంకా తక్షణమే అమల్లోకి రాలేదు. ఇరు దేశాలు ఉమ్మడి ఉత్పత్తి జాబితాలను అధికారికంగా ప్రచురించి.. తమ దేశీయ చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే ఇవి ఏకకాలంలో అమలవుతాయి. విస్తృత వాణిజ్య చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు వాషింగ్టన్, బీజింగ్‌లు తమ వాణిజ్య సంధిని జనవరి 10, 2027 వరకు పొడిగించాయి. స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నట్లుగా.. చైనాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం కాకుండా కేవలం రిస్క్ తగ్గించుకోవడమే అమెరికా లక్ష్యం. ఇందులో భాగంగా వ్యవసాయ కార్యవర్గ ఏర్పాటు, విదేశీ ఆర్థిక సంస్థలకు అనుమతులు, ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల పెంపు వంటి అంశాలపై కూడా ఇరు దేశాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+