కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం కనిపిస్తోంది. టాప్ ఫైవ్ మెట్రో నగరాల్లో హైరింగ్ రికవరీ కూడా దాదాపు నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఆంక్షల వల్ల ఐదు మెట్రో నగరాల్లో నియామక రికవరీపై ప్రభావం పడిందని, ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో లక్షలాది వైట్ కాలర్ నియామకాలు నిలిచిపోయాయి.

నియామకాల స్తబ్దత
పైన పేర్కొన్న ఐదు మెట్రో నగరాల్లోనే గత 12 నెలల కాలంలో 10 లక్షల నియామకాలు నిలిచిపోయాయి. ఇది ఏడాది నియామకాల్లో 40 శాతం. యాక్టివ్ వైట్ కాలర్ నియామకాల్లో స్తబ్దత కనిపించిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో 11 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ మెట్రో నగరాలు, మార్చి నెలలో స్వల్పంగా 1 శాతం వృద్ధిని కనబరిచాయి. వృద్ధి ఏటవాలుగా ఉంటుందని భావించినప్పటికీ, నియామక ప్రక్రియ పేలవమైన సంకేతంగా చెబుతున్నారు.

అందుకే నియామక ప్రక్రియ ఇలా
ఓ డేటా ప్రకారం మార్చి చివరి రెండు వారాలు సెకండ్ వేవ్ కారణంగా నియామక సెంటిమెంట్ బలహీనపడింది. మార్చిచివరి నాటికి మొత్తం చురుకైన వైట్ కాలర్ జాబ్ ఓపెనింగ్స్ నెల క్రితం 2,60,000తో పోలిస్తే 2,90,000గా ఉన్నాయి. కాబట్టి జాబ్ పోస్టింగ్స్ మందగమనం అంతకుముందు రెండు వారాల్లో చోటు చేసుకుందని చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ భయాలు, లాక్ డౌన్, వ్యాక్సినేషన్ కంపెయిన్, టీకా ప్రభావంపై చర్యలు వంటి అంశాలు నియామక ప్రక్రియ మందగమనానికి దారితీసినట్లు చెబుతున్నారు.

తాత్కాలిక విరామం
కరోనా కారణంగా విమానయాన సంస్థలు, ఆతిథ్యం, లార్జ్ ఫామ్ రిటైల్, వినోదం-రంగాలు గత ఏడాది తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ నేపథ్యంలో గత కొంతకాలంగా తగ్గడంతో నియామకాలు కాస్త పుంజుకున్నట్లు కనిపించాయి. అయితే ఇటీవల మళ్లీ నెమ్మదించాయి. కంపెనీలు కాస్త అప్రమత్తంగా ఉండటంతో తాత్కాలిక విరామం కనిపిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications