ముగిసిన రిలయన్స్ క్యాపిటల్ రెండో వేలం.. టాప్ బిడ్డర్ గా హిందూజా గ్రూపు.. ఎంతకు ఫైనల్ అంటే..
ముకేశ్ అంబానీ విజయవంతంగా దూసుకుపోతుండగా, అనిల్ అంబానీ పరిస్థితి అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలోని తన సగభాగాన్ని కోల్పోయి UK కోర్టులో నిలబడాల్సి వచ్చింది. దీంతో అప్పులు తీర్చడానికి రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ వంటి సంస్థలను అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో అనేక మార్లు పొడిగింపులు, ట్రిబ్యునళ్లు మరియు సుప్రీం కోర్టులో విచారణ అనంతరం రిలయన్స్ క్యాపిటల్ రెండవ వేలం సంవత్సరాల వెయిటింగ్ తర్వాత ముగిసింది. అత్యున్నత న్యాయస్థానం, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆమోదించిన వేలంలో, హిందూజా గ్రూప్ అతిపెద్ద బిడ్డర్ గా నిలిచింది. 9 వేల 650 కోట్ల బిడ్ తో ఈ వేలంలో విజయం సాధించింది.

మిగిలిన ఇద్దరు ప్రముఖ పోటీదారులు ఓక్ ట్రీ మరియు టోరెంట్ ఇన్వెస్ట్ మెంట్స్ ఈ వేలంలో పాల్గొనలేదు. మరోసారి వేలంపాటకు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను టోరెంట్ ఆశ్రయించినప్పటికీ, తిరిగి పాల్గొనడానికి మొదట నిర్ణయించుకుంది. మొదటిసారి బిడ్ ను టోరెంట్ గెలుచుకుంది కానీ ఇప్పుడు మాత్రం పాలుపంచుకోలేదు.
మొదటి బిడ్డింగ్ ప్రక్రియలో రిలయన్స్ క్యాపిటల్ కోసం టోరెంట్ 8 వేల 640 కోట్లను ఆఫర్ చేసింది. హిందుజా గ్రూపు కోట్ చేసిన 8 వేల 110 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని టోరెంట్ వెచ్చించడానికి సిద్ధమైంది. అయితే ఆ సంస్థ టాప్ బిడ్డర్‌గా మారిన తర్వాత, హిందూజా 9 వేల కోట్లను ఆఫర్ చేసింది. దీనికి టోరెంట్ అభ్యంతరం తెలిపింది.
అందువల్ల రుణదాతలు మరియు ఇతర బిడ్డర్లు మరోమారు వేలానికి అంగీకరించారు. దీనిని NCLT అడ్డుకోగా NCLAT సైతం టోరెంట్ ను విజేత బిడ్డర్ గా మొదటిసారి అంగీకరించింది. తదనంతర తీర్పులో మార్పు చోటుచేసుకుంది. కాగా ఈ కొత్త వేలంలో రుణదాతలు 9 వేల 500 కోట్లను కనీస బిడ్ గా నిర్ణయించారు. కనీస ముందస్తు నగదు చెల్లింపును 8 వేల కోట్లుగా నిర్ణయించారు. అయితే ఏకైక బిడ్డర్ గా నిలిచిన హిందూజా, కనీస థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ధరను అందించడమే కాకుండా మొత్తం 9 కోట్ల నగదును ముందస్తుగా చెల్లించడానికి సైతం అంగీకరించింది.


Click it and Unblock the Notifications