కాలం మారుతోంది.. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది.. టెక్నాలజీతో పాటు మనం చేసే ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి! 2024 వరకు కొన్ని పనులు కేవలం ప్రయోగాత్మకంగానో లేదా ఇతర ఉద్యోగాల్లో భాగంగానో ఉండేవి. కానీ, 2025 నాటికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), పర్యావరణ మార్పులు, డిజిటల్ విప్లవం కారణంగా సరికొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. వీటిలో విశేషం ఏమిటంటే, వీటిలో చాలా ఉద్యోగాలకు నెలకు రూ. 1 లక్ష నుండి రూ. 3 లక్షల వరకు జీతం ఇస్తున్నారు. అవేంటో మరియు వాటికి ఎందుకు అంత డిమాండ్ ఉందో ఇప్పుడు చూద్దాం!
1. AI ఎథిక్స్ స్పెషలిస్ట్ (AI Ethics Specialist)
AI వాడకం పెరిగే కొద్దీ దానివల్ల వచ్చే డేటా లీకులు, కాపీరైట్ సమస్యలు ఎక్కువయ్యాయి. వీటిని అరికట్టడమే ఈ స్పెషలిస్టుల పని. కంపెనీలు వాడే AI సిస్టమ్స్ చట్టబద్ధంగా ఉన్నాయో లేదో వీరు చూస్తారు. వీరి జీతం నెలకు రూ. 1.5 - 3 లక్షలు ఉంటుంది. లా (Law), పబ్లిక్ పాలసీ లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వారు ఇలాంటి ఉద్యోగాలకు అర్హులు.
2. క్లైమేట్ రిస్క్ అనలిస్ట్ (Climate Risk Analyst)
ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ఎండలు బిజినెస్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వీరు అంచనా వేస్తారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు వీరికి రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. వీరి జీతం నెలకు రూ. 1 - 1.5 లక్షలు ఉంటుంది. ఎకనామిక్స్, డేటా అనాలిసిస్ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు ఇలాంటి జాబ్స్ కు అర్హులు.

3. AI ప్రొడక్ట్ మేనేజర్ (AI Product Manager)
సాధారణ ప్రొడక్ట్ మేనేజర్ల కాలం పోయింది. ఇప్పుడు AI మోడల్స్ ఎలా పని చేయాలి, బిజినెస్‌కు ఎలా ఉపయోగపడాలి అని ప్లాన్ చేసేవారికే డిమాండ్. వీరి జీతం నెలకు రూ. 1.5 - 2.5 లక్షలు ఉంటుంది. ఇంజనీరింగ్ లేదా అనలిటిక్స్ తెలిసిన మేనేజర్లు ఈ ఫీల్డ్ కు సూట్ అవుతారు.
4. ప్రాంప్ట్ ఇంజనీర్ (Prompt Engineer)
AI నుంచి సరైన అవుట్‌పుట్ రావాలంటే దానికి ఇచ్చే కమాండ్ (Prompt) చాలా ముఖ్యం. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ప్రాంప్ట్స్‌ని కూడా ఒక కోడింగ్‌లా భావిస్తున్నాయి. అందుకే దీనిని ఒక ప్రొఫెషనల్ జాబ్‌గా మార్చేశారు. వీరికి జీతం నెలకు రూ. 1 - 1.8 లక్షలు ఉంటుంది.
5. వెర్నాక్యులర్ UX డిజైనర్ (Vernacular UX Designer)
ఇంటర్నెట్ ఇప్పుడు గ్రామాలకు కూడా చేరింది. ఇంగ్లీష్ రాని వారు కూడా యాప్స్ వాడుతున్నారు. వారికీ అర్థమయ్యేలా తెలుగు, హిందీ వంటి భాషల్లో యాప్ డిజైన్లను రూపొందించేవారే ఈ వెర్నాక్యులర్ డిజైనర్లు. వీరికి జీతం నెలకు రూ. 1 - 1.4 లక్షలు ఉంటుంది.
6. సైబర్ సెక్యూరిటీ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్
AI సాయంతో హ్యాకర్లు దాడులు చేస్తుంటే, వారిని అడ్డుకోవడానికి అంతకంటే తెలివైన అనలిస్టులు కావాలి. వీరు కేవలం వైరస్‌లనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో జరిగే సైబర్ యుద్ధాలను ట్రాక్ చేస్తారు. వీరికి జీతం నెలకు రూ. 1 - 2 లక్షలు. ఉంటుంది.
ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి?
ఈ ఉద్యోగాలన్నీ చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఇవి కొత్త డిగ్రీల వల్ల రాలేదు, కొత్త సమస్యల వల్ల పుట్టుకొచ్చాయి. సిలబస్ మారే వరకు వెయిట్ చేయకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త స్కిల్స్ నేర్చుకునే వారికే ఫ్యూచర్ లో లో తిరుగులేదు. డిగ్రీ సర్టిఫికేట్ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే మీ జీతం లక్షల్లో ఉండటం ఖాయం!
More From GoodReturns

ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications