భారీగా బంగారం ధరల పతనం: నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా; అక్కడ మాత్రం 60వేలకు పైనే!!
నేడు భారీగా బంగారం ధరలు పడిపోయాయి. ఆర్నమెంట్ బంగారం మీద 500 రూపాయలు, స్వచ్చమైన బంగారం మీద 540 రూపాయలు తగ్గింది. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా ఉన్నాయి.
భారతదేశంలో మొన్న 60 వేల మార్కును దాటి ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన బంగారం ధరలు నేడు మళ్ళీ భారీగా పతనమైన పరిస్థితి కనిపిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో బంగారం కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో, మళ్లీ బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట నిస్తుంది. అయితే బంగారం ధరలు కొద్దిపాటి హెచ్చుతగ్గులతో స్థిరంగా కొనసాగితే ఇబ్బంది ఉండదు. కానీ అలా కాకుండా బంగారం ధరలలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతుండడం, ఒకేసారి విపరీతంగా పెరుగుతుండడం బంగారం ప్రియులను బంగారం కొనుగోలు చేయాలా వద్దా అన్న సందిగ్ధానికి గురిచేస్తుంది.

నేడు భారీగా పతనమైన బంగారం ధరలు
ఇక తాజాగా నేడు బంగారం ధరలను చూసినట్లయితే దేశీయంగా నేడు బంగారం ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 500 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 540 రూపాయల మేర తగ్గాయి. మొన్న శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలు ఉండగా, నిన్న కూడా అదే ధర స్థిరంగా కొనసాగింది. ఇక నేడు 500 రూపాయల మేర తగ్గి 54,800 రూపాయల వద్ద ఆర్నమెంట్ బంగారం ధర ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మొన్న 60 వేల 320 రూపాయలకు చేరుకుంది. నిన్న అదే ధర స్థిరంగా కొనసాగింది. ఇక నేడు 540 తగ్గి 59,780 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా
ఇదిలా ఉంటే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 54,800 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780గా కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,800 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780గా కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,950గా ట్రేడ్ అవుతుంటే, ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,930 రూపాయలుగా కొనసాగుతుంది.

ముంబై, బెంగళూరులలో బంగారం ధరలు ఇలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,800గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 59,780గా కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,850 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,830 రూపాయలుగా కొనసాగుతుంది.

తమిళనాడులో బంగారం ధరలు 60 వేల పైమాటే
ఇక దేశంలోనే బంగారం ధరలలో అత్యధిక ధరలు ఉండే చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, వేలూరు, తిరునవ్వేలి, తిరుచ్చి, ఈ రోడ్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేలకు పైమాటే ఉంది. నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో 60 వేల 650 రూపాయల వద్ద కొనసాగుతుంది . 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,600 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాలలో స్థానిక పన్నులను బట్టి బంగారం ధరలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి.


Click it and Unblock the Notifications