సవాళ్లతో కూడిన 2019 సంవత్సరం మరి కొన్ని రోజుల్లో ముగిసిపోనుంది. ఇప్పుడు అందరి దృష్టి 2020 పడింది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అంత సిద్ధమవుతున్నారు. చిన్నా, పెద్దా, పేద, సంపన్న అనే తేడాలు లేకుండా అందరిదీ ఒకటే కోరిక. 2020 లో తమ జీవితాలు మరింత మెరుగు అవ్వాలన్నదే. కానీ ఇప్పుడే 2020 కి సంబంధించి షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. రకరకాల సమస్యలతో, ఆర్థిక మందగమనం ప్రభావంతో 2019 లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
వారంతా కూడా కొత్త సంవత్సరం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. నూతన ఏడాదిలో నైనా నచ్చిన రంగంలో బెటర్ శాలరీ తో జాబ్ వస్తుందేమోనని. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. వారికే కాదు, కొత్తగా కొలువుల్లోకి ప్రవేశించే వారికి కూడా బ్యాడ్ న్యూస్. 2020 లోనూ అనుకున్నంత మేరకు ఉద్యోగాలు రాకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకు కారణాలు వెల్లడిస్తున్నారు. ఈ అంశంపై ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు....

నైపుణ్యానికి జై...
ప్రతి రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీ ప్రభావం అధికమవుతోంది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్చైన్ వంటి కొత్త సాంకేతిక అందుబాటులోకి వచ్చింది. అందుకే అన్ని సంస్థలు సాంప్రదాయ టెక్నాలజీల నుంచి నవతరం టెక్నాలజీలను అమలు చేసే దిశగా పయనిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న నిపుణులకు ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి. అంతేకానీ అందుకోసం కొత్త వారిని నియమించుకోవడం చాలా తక్కువగా ఉంటోంది.
భారత జీడీపీ వృద్ధి రేటుతో పాటు కీలక ఆర్థికాంశాలు ఆశాజనకంగా లేకపోవటం వల్ల 2020 లో కొత్త ఉద్యోగాలు తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఒకవేళ ఉన్నా... అతి స్వల్ప వృద్ధి రేటు మాత్రమే ఉంటుంది తప్ప గొప్ప సంఖ్యలో అవి ఉండవు అని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రబోర్తి వెల్లడించారు. దేశంలో వినియోగం, పెట్టుబడులు పెరిగితే మాత్రం కొంత పురోగతి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు.

అన్ని రంగలది అదే దారి...
దేశంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ఒకటే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఏ రంగంలోనూ మెరుగైన ఉద్యోగాలు ఉంటాయన్న సంకేతాలు అందలేదని చెప్పారు. 2020 తొలి త్రైమాషికంలో ఉద్యోగాల కల్పన రేటు పడిపోతుందని, కంపెనీలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాయని గ్లోబల్ హంట్ ఇండియా ఎండి సునీల్ గోయల్ తెలిపారు. అయితే వచ్చే ఏడాది రెండో అర్ధ భాగంలో మాత్రం పరిస్థితి కాస్త మారొచ్చని చెప్పారు. ప్రస్తుతమున్న ఉద్యోగాల సామర్థ్యం అంచనా వేసి .. వారికే కొత్త టెక్నాలజీ నేర్పించే పనిలో కంపెనీలు ఉన్నాయని, దాదాపు అన్ని రంగాల్లోనూ కొత్త కొలువుల మాటే వినిపించటం లేదని మెర్సెర్ సంస్థ ప్రిన్సిపాల్ - ఇండియా ప్రొడక్ట్స్ లీడర్ అండ్ కెరీర్ కన్సల్టింగ్ (నార్త్ ఈస్ట్ & బంగ్లాదేశ్) పేర్కొన్నారు.

డేటా సైన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ...
ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు తగ్గిన రంగాల్లో కొత్త కొలువులకు గిరాకీ ఉండదు. కానీ డేటా సైన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, ఐవోటీ, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ మార్కెటింగ్, బ్లాక్‌చైన్ సాంకేతికల్లో మాత్రం డిమాండ్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ ల్లో ఉద్యోగాలతో పాటు వేతనాలు కూడ అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో సాధారణ స్కిల్స్ ఉండే తరహా ఉద్యోగులకు శాలరీ వృద్ధి ఉండబోదని, పైపెచ్చు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేవని అభిప్రాయపడుతున్నారు. 2020 లో బిజినెస్ లోని దాదాపు అన్ని విభాగాలు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో ఆటోమేషన్ కు లోనవుతాయని, చివరకు కస్టమర్ సర్వీస్ కు కూడా దీనినే వాడుతారని పుబ్లిసిస్ సేపియన్స్ చీఫ్ టాలెంట్ ఆఫీస్ అధికారి కామేశ్వరి రావు వ్యాఖ్యానించారు.

ఐటీ , బ్యాంకింగ్, ఈ- కామర్స్ ...
కాగా 2020 లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), బ్యాంకింగ్, ఈ-కామర్స్ రంగాలతో పాటు టెలికాం, ఆతిథ్యము, టూరిజం రంగాల్లో ఉద్యోగాలకు గిరాకీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేతనాలు కూడా రెండంకెల వృద్ధి నమోదు చేస్తాయని చెప్పారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ , ఆటోమొబైల్, ఎడ్యుకేషన్ రంగాలు ఆర్థిక మందగమనం లోనయ్యాయని తెలిపారు. కాబట్టి, 2020 లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండే రంగాలు, వాటికి తగిన సాంకేతిక నైపుణ్యం మెరుగు పరచుకొని కొత్త కొలువులో చేరిపోండి. ఆల్ ది బెస్ట్!
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications