Tech Jobs: దేశీయ ఐటీ కంపెనీల్లోని పరిస్థితులు టెక్కీలకు టెర్రర్ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా టాప్-3 ఐటీ కంపెనీలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లలో పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో టెక్ ఉద్యోగుల సంఖ్యలు భారీగా క్షీణించినట్లు ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడైంది.
అంతర్జాతీయంగా క్షీణించిన పరిస్థితులతో ఐటీ సేవల కంపెనీల వ్యాపారం తగ్గింది. చాలా కంపెనీలు తమ టెక్ బడ్జెట్‌లను కుదించటంతో భారతీయ ఐటీ కంపెనీలు తగ్గిన ఆర్డర్లతో ఇబ్బంది పడుతున్నాయి. ఇదే క్రమంలో ఈ మూడు టెక్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 64,000 మేర తగ్గినట్లు వెల్లడైంది. కంపెనీల వారీగా పరిశీలిస్తే విప్రోలో ఉద్యోగుల సంఖ్య గతం ఏడాది మార్చిలో 2,58,570 నుంచి 2,34,054కి అంటే 24,516 మంది తగ్గారు. అయితే ఇది వ్యాపారం తగ్గుదలతో పాటు పెరిగిన ఆపరేటింగ్ సామర్థ్యాలు కారణంగా కంపెనీ పేర్కొంది. అలాగే ఏఐ వినియోగం పెరిగినందున ఉద్యోగుల సంఖ్య తగ్గిందని విప్రోలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ వెల్లడించారు.

254 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశంలోని ఐటీ సేవల రంగం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కఠినమైన సమయాల్లో నావిగేట్ చేస్తోంది. ఈ క్రమంలో దేశంలో 2న అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ మార్చి 2024 నాటికి మునుపటి ఏడాది కంటే ఉద్యోగుల సంఖ్య 25,994 మేర తగ్గుదలను నమోదు చేసింది. అయితే కంపెనీలో అట్రిషన్ రేటు తగ్గిందని ఇన్ఫోసిస్ CFO జయేష్ సంఘ్‌రాజ్కా వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం టెక్ దిగ్గజం చురుకైన క్యాంపస్ హైరింగ్ మోడల్‌ను అవలంబించింది.
ఇక చివరిగా దేశంలోని టాప్ టెక్ దిగ్గజం టీసీఎలో ఉద్యోగుల సంఖ్య మార్చి 2024 నాటికి అంతకు ముందు ఏడాదితో పోల్చితే 13,249 మేర తగ్గినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,01,546కి పరిమితమైంది. TCS, Infosys, Wiproలలో సామూహిక ఉద్యోగుల తగ్గింపు ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా భారత ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లను సూచిస్తోంది. ఇలాండి గడ్డు కాలంలో కంపెనీలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు హ్యూహాత్మకంగా ఉద్యోగుల సంఖ్యలను సర్థుబాటు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరికొంత కాలం ఇదే ధోరణి టెక్ ఉద్యోగాల విషయంలో కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications