గ్రామీణ భారతం వరకు చేరేందుకు ప్రభుత్వరంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను 25,000కు పెంచుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి (మార్చి) నాటికి పెద్ద ఎత్తున కరస్పాండెంట్లను నియమించుకోనుంది. ప్రస్తుతం 11,000 బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉండగా, కొత్తగా 14,000 మందిని తీసుకోనుంది. తద్వారా 25వేలకు పెంచుకోనుంది. తద్వారా గ్రామీణ ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తోంది.

14000 కొత్త కరస్పాండెంట్లు
దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి కస్టమర్‌కు ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందించే ప్రయత్నాల్లో భాగంగా కరస్పాండెంట్లను తీసుకోనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ అధికారి స్మితాభగత్ తెలిపారు. ఇప్పటికే కొంతమందిని నియమించామని చెప్పారు. ప్రస్తుతం పని చేస్తున్న 11వేల మంది కరస్పాండెంట్లకు అదనంగా మరో 14వేల మందిని నియమిస్తామని తెలిపారు. బ్యాంకు అన్ని ప్రాంతాల్లో వేగంగా విస్తరించాలని భావిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అకౌంట్లు, ఎఫ్‌డీలు
ఇక గ్రామీణ ప్రాంతాల్లోని వారు కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, పేమెంట్ ప్రోడక్ట్స్, లోన్ క్లోజింగ్ వంటి సదుపాయాల్ని ఇంటి నుండి పొందవచ్చునని స్మితాభగత్ తెలిపారు. అలాగే కరస్పాండెంట్ల వ్యవస్థను మరింత బలపరించేందుకు, విస్తరించేందుకు ప్రభుత్వ కామన్ సర్వీస్ కేంద్రాలతో (CSC) ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతానికి విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా 2018లో CSC ఈ-గవర్నెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా అందరికీ ఆర్థిక సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు జత కట్టినట్లు తెలిపారు. ఇప్పుడు అదే లక్ష్యంతో బ్యాంకు కరస్పాండెంట్లను నియమించనున్నట్లు తెలిపారు.

సులభంగా రుణ సౌకర్యం
సీఎస్సీతో కలిసి బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించడం వల్ల యువత, ఎంటర్‌ప్రెన్యూయర్స్, రైతులు, మహిళలు బ్యాంకు నుండి సులభంగా రుణ సౌకర్యం పొందే అవకాశాలుఉంటాయి. దేశవ్యాప్తంగా 3,00,000 సీఎస్సీ కేంద్రాలు ఉన్నాయి. కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో HDFC బ్యాంకు స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ 20 శాతం పెరిగి రూ.6,658.62గా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.5,568.16 కోట్లుగా ఉంది. బ్యాంకు ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.34,453.28కు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.32,361.84 కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications