ముంబై: ప్రైవేట్ సెక్టార్‌లో అతి పెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ).. కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. ఫోర్త్ క్వార్టర్‌లో అంచనాలకు మించి రాణించిందా బ్యాంక్. నికర లాభాలను భారీగా పెంచుకోగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 22.8 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.

ఎఫ్డీలపై వడ్డీరేటు..
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగు, చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 22.8 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను రికార్డు చేసింది. ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై తన వడ్డీ రేటును పెంచింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పెంచిన వడ్డీ రేట్లను 2 కోట్ల రూపాయలకు దిగువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తింపజేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును పెంచిన రెండు వారాల వ్యవధిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.

వడ్డీరేట్ల వివరాలిలా..
దీని ప్రకారం వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 15 నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 2.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం. 30 నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం. 46 నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం. 61 నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. 91 నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం.

ఏడాది వరకు
ఆరు నెలలు దాటిన తొలి రోజు నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు- 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును వర్తింపజేసింది. తొమ్మిది నెలలు దాటిన తొలి రోజు నుంచి సంవత్సరం లోపల వరకు: సాధారణ ప్రజలకు- 4.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ ఉంటుంది. ఒక సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు- 5.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం వడ్డీ రేటును వర్తంపజేసింది.

ఏడాది దాటితే..
ఒక సంవత్సరం దాటిన తొలి రోజు నుంచి రెండు సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు- 5.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.60 శాతం, రెండు సంవత్సరం దాటిన తొలి రోజు నుంచి మూడు సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు- 5.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం, మూడు సంవత్సరాలు దాటిన తొలి రోజు నుంచి అయిదేళ్ల వరకు: సాధారణ ప్రజలకు- 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.10, అయిదు సంవత్సరాలు దాటిన తొలి రోజు నుంచి పదేళ్ల వరకు: సాధారణ ప్రజలకు- 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 వడ్డీరేటు ఉంటుంది.

ఆ జాబితాలో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఇదివరకే తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేరింది. పెంచిన వడ్డీరేట్లు ఇవ్వాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.
More From GoodReturns

డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్‌పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications