ప్రైవేట్ రంగ బ్యాంకు బ్యాంకుల్లో దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ వినియోగదారుల కోసం పండుగ ఆఫర్లను ప్రారంభించింది.హెచ్‌డిఎఫ్‌సి 'ఫెస్టివల్ ట్రీట్స్' అనేది భారత ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్స్ (సిఎస్‌సి) నెట్‌వర్క్ ద్వారా అందించే బ్యాంక్ వార్షిక ఆర్థిక సేవల ధమాకా. సిఎస్‌సిలో చేరిన 1.2 లక్షల గ్రామ స్థాయి వ్యవస్థాపకుల (విఎల్‌ఇ) నెట్‌వర్క్ ద్వారా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు వారి కోసం ప్రత్యేకంగా అందిస్తున్న ఆఫర్లను పొందవచ్చు.

పలు వ్యాపార సంస్థలతో టై అప్ .. హెచ్‌డిఎఫ్‌సి ఫెస్టివల్ ట్రీట్
రుణాల నుండి బ్యాంకు ఖాతాల వరకు వినియోగదారులకు అన్ని బ్యాంకింగ్ సేవలను ప్రత్యేకంగా అందిస్తుంది . ఇందులో గృహ రుణాలు, 2-వీలర్ రుణాలు, కారు రుణాలు, ట్రాక్టర్ రుణాలు, బంగారు రుణాలు లేదా వ్యాపార వృద్ధి రుణాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ స్థాయిలో కూడా బ్యాంక్ తన సేవలను అందించటానికి 3,000కు పైగా హైపర్ లోకల్ వ్యాపారులను హెచ్‌డీఎఫ్‌సీ కలిగి ఉంది . దుస్తులు, ఎలక్ట్రానిక్స్, కిరాణా, గృహాలంకరణ మరియు ఆభరణాలతో సహా వివిధ విభాగాలలో వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిపితే 5% నుండి 15% వరకు ఫ్లాట్ పొందవచ్చు. ఇందులో 1,000 కంటే ఎక్కువ జాతీయ మరియఅంతర్జాతీయ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

వ్యాపారులకు బెనిఫిట్
ఆర్థిక పరిష్కారాల స్పెక్ట్రమ్‌లో లభించే ప్రత్యేక పండుగ ఆఫర్లను పొందటానికి వినియోగదారులు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు . ప్రస్తుత పరిస్థితులలో, ఈ ఆఫర్లన్నీ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ తో రిటైల్ మరియు వ్యాపార కస్టమర్లు ఈ క్రింది ప్రయోజనాలను పొందవచ్చు. రుణాల ప్రాసెసింగ్ ఫీజుపై తగ్గింపు తో పాటు ఈఎంఐలలో తగ్గింపు కూడా పొందవచ్చు . కొన్ని లోన్ల రికవరీ ఛార్జీలపై తగ్గింపు కూడా ఉంది .

వినియోగదారులకు బెనిఫిట్ .. ఈజీగా రుణాలు, బోలెడు రాయితీలు
గ్రామీణ వినియోగదారులకు ప్రయోజనాలు చూస్తే జీరో ప్రాసెసింగ్ ఫీజు వద్ద టూ వీలర్ లోన్ ఇస్తుంది . డౌన్ పేమెంట్ 1999 రూపాయల నుండి మొదలై 25% అతి తక్కువ ఈఎంఐ వరకు మొదటి 6 నెలలు కట్టాల్సి ఉంటుంది . ట్రాక్టర్ రుణాల కోసం ప్రొసీజర్ ఛార్జీలపై 50% తగ్గింపు ఇస్తుంది . అక్టోబర్ 1 నుండి నవంబర్ 15 మధ్య బుక్ చేసే ట్రాక్టర్లపై 90% వరకు రుణాలు ఇస్తుంది . కిసాన్ గోల్డ్ లోన్ కోసం ప్రాసెసింగ్ ఫీజులో 50% మాఫీ చేయబడుతుంది .

గ్రామీణ , పట్టణ ప్రాంత ప్రజలకు పండుగల ఆఫర్ లతో లోన్స్
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నామని , పట్టణ ప్రాంతాలలో ఉన్నవారికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పండుగ ఆఫర్ ల ద్వారా వారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలని కోరుకుంటున్నామని సిఎస్‌సి ఎస్‌పివి సిఇఒ దినేష్ త్యాగి చెప్పారు. సిఎస్సి ఎస్పివితో మా భాగస్వామ్యం ద్వారా మేము గత సంవత్సరం ఈ మార్కెట్లలో చాలా మందిని చేరుకోగలిగామని ఆయన చెప్పారు. మునుపటి ఫెస్టివల్ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు గ్రామ స్థాయి వ్యవస్తాపకులను అభినందిస్తున్నానని చెప్పారు . హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫెస్టివల్ ట్రీట్స్ 2.0 ప్రచారంలో 2 వ దశ. సెప్టెంబర్ 30 న దేశవ్యాప్తంగా డిజిటల్‌గా దీనిని లాంచ్ చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications