ఎవరైనా ఏదైనా ఊహించని సమయంలో డబ్బు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టడం లేదా అమ్మడం చేస్తుంటారు. కానీ బంగారం అమ్మితే ఆదాయపు పన్ను కట్టాల్సిందేనా.... గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం అమ్మకంపై ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని నిబంధనలను మార్చారు. ఈ మార్పులు 23 జూలై 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఫిజికల్ గోల్డ్ అయినా, పేపర్ గోల్డ్ అయినా, డిజిటల్ గోల్డ్ అయినా అన్ని రకాల బంగారం అమ్మకంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే బంగారం అమ్మకంపై ఎంత పన్ను కట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
బంగారం అమ్మితే రెండు రకాల పన్నులు చెల్లించాలి. మొదటిది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (STCG) అండ్ రెండవది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG). బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఎంతకాలం విక్రయిస్తారన్న దానిపై ఆధారపడి ఎంత పన్ను కట్టాలఉంటుంది. దీని ఆధారంగా LTCG అండ్ STCG విధిస్తారు. ఈ పన్ను పూర్తి అమ్మకం ధరపై విధించబడదని గమనించాలి. మీరు సంపాదించే లాభంపై మాత్రమే పన్ను విధించబడుతుంది.

ఫిజికల్ బంగారంపై ఎంత పన్ను?
మీరు ఫిజికల్ బంగారాన్ని (బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, నాణేలు మొదలైనవి) అమ్మితే మీరు దానిపై కూడా LTCG అండ్ STCG పన్ను చెల్లించాలి.
బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే దానిపై 20 శాతం STCG చెల్లించాలి. గతంలో 15 శాతంగా ఉండేది. జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీనిని 20 శాతానికి పెంచారు. దీనిపై 4 శాతం సెస్ కూడా విధిస్తారు. ఇలా మొత్తం 20.8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మీరు బంగారం కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత అమ్మితే మీరు దానిపై ఎల్‌టిసిజి చెల్లించాలి. గతంలో 10 శాతంగా ఉండేది. జూలై 23 నుంచి 12.5 శాతానికి పెంచారు. అయితే ఇందులో మినహాయింపును రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచారు.
పన్ను ఎలా లెక్కిస్తారు?
మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని రెండేళ్లలోపు విక్రయిస్తే మీరు దానిపై 20 శాతం STCG అండ్ 4 శాతం సెస్ చెల్లించాలి. మీరు రూ. 10,000 వేల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్లలో రూ. 15,000 వేలకు అమ్మారని అనుకుందాం, ఈ అమ్మకం ద్వారా మీకు రూ.5 వేల లాభం వచ్చింది.
ఈ లాభం మీ మొత్తం ఏడాది ఆదాయానికి కలుపుతారు. దీని తర్వాత, మీ వార్షిక ఆదాయాలు తగ్గే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం మీరు ఆదాయపు పన్ను చెల్లించాలి. మీరు కొత్త లేదా పాత ఆదాయపు పన్ను ఏదైనా స్లాబ్‌ని ఎంచుకోవచ్చు. మీ మొత్తం ఆదాయం జీరో ట్యాక్స్ స్లాబ్‌లోకి వస్తే, మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
మీరు రెండేళ్ల తర్వాత బంగారాన్ని అమ్మితే మీరు 12.5 శాతం ఎల్‌టిసిజి చెల్లించాలి. అయితే మీ లాభం రూ. 1.25 లక్షల వరకు ఉంటే దానిపై పన్ను ఉండదు. అయితే రూ.1.25 లక్షల కంటే ఎక్కువ లాభం వస్తే దానిపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి



Click it and Unblock the Notifications