యూత్ అందరూ కావాలని కోరుకునే డ్రీం బైక్ హార్లే డేవిడ్సన్ .. తాజా పరిస్థితులు, అమ్మకాలు పడిపోవటంతో కీలక నిర్ణయం తీసుకుంది. హై-ఎండ్ బైక్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ భారతదేశంలో తమ సంస్థ కార్యకలాపాలను మూసివేయాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం . అమ్మకాలు భారీగా పడిపోవటంతో పాటుగా , భవిష్యత్తులో వాహనాల డిమాండ్ అస్పష్టంగా కనిపిస్తోన్న నేపధ్యంలో ఇండియాలో తన కార్యాకలాపాల నుండి నిష్క్రమించాలని ఆలోచిస్తుంది .

హర్యానాలోని బావాల్ వద్ద ప్లాంట్ మూసివేత ఆలోచన
హర్యానాలోని బావాల్ వద్ద లీజుకు తీసుకున్న హార్లే డేవిడ్సన్ ప్లాంట్ సదుపాయాన్ని మూసివెయ్యాలని భావిస్తున్న సంస్థ , ఈ ప్లాంట్ కు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఇవ్వటానికి ఏర్పాట్ల కోసం కొన్ని వాహన తయారీదారులకు ఫీలర్‌లను పంపినట్లు తెలుస్తుంది.అవుట్ సోర్సింగ్ ఒప్పందం చేసుకుని చేతులు దులుపుకునే పనిలో ఉంది . కరోనా కారణంగా అంతర్జాతీయంగానే మార్కెట్ దెబ్బ తింది. ఆటోమొబైల్ రంగం కుదేలయింది . దీంతో ఆ ఎఫెక్ట్ హార్లే డేవిడ్సన్ మీద కూడా బాగా పడింది .

రెండవ త్రైమాసిక ఫలితాలలోనే సంస్థ సంకేతాలు
ప్లాంట్ ను మూసివేసే నిర్ణయం సుమారు 50 మార్కెట్లపై దృష్టి పెట్టడానికి దాని ‘రివైర్' వ్యూహానికి అనుగుణంగా ఉంది. ప్రధానంగా ఉత్తర అమెరికా, యూరప్ మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కంపెనీ వాల్యూమ్ మరియు వృద్ధి సామర్థ్యంలో ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది. గత నెలలో వచ్చిన రెండవ త్రైమాసిక ఫలితాలతో హార్లే-డేవిడ్సన్ ఇలా పేర్కొన్నారు . "అంతర్జాతీయ మార్కెట్ల నుండి నిష్క్రమించే ప్రణాళికలను కంపెనీ అంచనా వేస్తోందని పేర్కొంది. ఇక్కడ భవిష్యత్ వ్యూహానికి అనుగుణంగా నిరంతర పెట్టుబడులకు వాల్యూమ్‌లు మరియు లాభదాయకత మద్దతు ఇవ్వవు అంటూ సంస్థ వ్యాఖ్యానించింది .

గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ బైక్స్ అమ్మకం
హార్లే-డేవిడ్సన్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించినట్లు సంస్థ అధికారులు తెలిపారు. నిష్క్రమణ జరిగితే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి భారతదేశంలో కార్యకలాపాలను మూసివేసిన రెండవ వాహన తయారీదారు హార్లే-డేవిడ్సన్ గా ఉంటుంది. గతంలో జనరల్ మోటార్స్ తన దేశీయ కార్యకలాపాలను వదిలేసి 2017 లో తన గుజరాత్ ప్లాంట్ ను విక్రయించింది.భారతదేశంలో సంస్థ తాజా పరిస్థితి నిర్ణయంపై హార్లే దేవ్ద్సన్ మాత్రం మాట్లాడటానికి నిరాకరిస్తుంది.

అమ్మకాలు లేక ,భవిష్యత్ లో డిమాండ్ ఉండదనే నిర్ణయం
హార్లే-డేవిడ్సన్ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో 2,500 కన్నా తక్కువ యూనిట్లు విక్రయించింది మరియు 2020 ఏప్రిల్-జూన్ మధ్య కేవలం 100 బైక్‌లను మాత్రమే విక్రయించిందని పరిశ్రమ అధికారులు తెలిపారు.చాలా దారుణంగా అమ్మకాలు పడిపోవటం , భవిష్యత్ లో కూడా బైక్ కు డిమాండ్ ఉంటుందనే భావన కలగకపోవటం వంటి కారణాలతో సంస్థ ఇండియాలో ప్లాంట్ మూసివెయ్యాలని ఆలోచిస్తుంది. 2009 లో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన హార్లే-డేవిడ్సన్ ఇక్కడ దశాబ్ద కాలంగా కార్యాకలాపాలు కొనసాగిస్తుంది . దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు కొత్త బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా కొత్త మోడళ్లను కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications