ఇండియన్ క్రికెట్ టీం నుండి ఐపియల్ సమయంలో ధోని, విరాట్ తరువాత ఎక్కువ వినిపించిన పేర్లలో హార్దిక్ పాండ్య ఒకరు. హార్దిక్ పాండ్య ఐపియల్ టీమ్స్'లోని ముంబై ఇండియన్స్ కెప్టెన్ కూడా. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆట, వ్యక్తిత్వం కారణంగా క్రికెట్ ప్రపంచంలోనే కాకుండా వ్యాపార ప్రపంచంలో కూడా గొప్ప సక్సెస్ సాధించాడు. అయితే ఈ క్రికెటర్ సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం...
హార్దిక్ పాండ్య మొత్తం ఆస్తులు (net worth) దాదాపు రూ. 94 కోట్లుగా అంచనా. అతని సంపాదన ముఖ్యంగా BCCI కాంట్రాక్ట్, IPL జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా అలాగే వివిధ పెట్టుబడుల నుండి ఆర్జిస్తున్నారు. అంతేకాదు హార్దిక్ పాండ్యా లగ్జరి లైఫ్ స్టయిల్ గురించి కూడా ఎప్పుడు చర్చల్లో ఉంటుంది. భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాని 'కుంగ్ ఫూ పాండా' అని కూడా పిలుస్తారు.

BCCI కాంట్రాక్ట్ అండ్ మ్యాచ్ ఫీజులు : హార్దిక్ పాండ్యాని భారత క్రికెట్ కంట్రోల్ మండలి (BCCI) గ్రేడ్-ఎ కాంట్రాక్టులో చేర్చింది, దీని కింద అతను ఏటా రూ. 5 కోట్లు పొందుతారు. దీనితో పాటు వివిధ ఫార్మాట్ల మ్యాచ్‌లు ఆడినందుకు అతనికి అదనంగా మ్యాచ్ ఫీజులు కూడా లభిస్తాయి. టెస్ట్ మ్యాచ్‌కు 30 లక్షలు, వన్డే మ్యాచ్‌కు 20 లక్షలు, T20 మ్యాచ్‌కు 15 లక్షలు, హార్దిక్ ఎక్కువగా T20, ODI క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి అతని మ్యాచ్ ఫీజులో ఎక్కువ భాగం ఈ ఫార్మాట్ల నుండే వస్తుంది. అతని అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండ్ లీడర్షిప్ పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులో అతని ఒప్పందాన్ని మరింత పొడిగించవచ్చు.
ఐపీఎల్ ఆదాయం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుండి హార్దిక్ పాండ్యాకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. అతను 2022 నుండి 2023 సీజన్లలో గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్‌గా ఉన్నాడు, అతనికి ప్రతి సీజన్‌కు రూ.15 కోట్లు అందుతున్నాయి. తాజాగా 2024 IPL సీజన్ కోసం హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ చేసింది. ఐపీఎల్‌లో హార్దిక్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, కెప్టెన్సీ కారణంగా అతని జీతం మరింత పెరిగే అవకాశం ఉంది.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు: హార్దిక్ పాండ్యా స్టైలిష్ లుక్స్, ఆకర్షణీయమైన పర్సనాలిటీ కారణంగా బ్రాండ్లలో బాగా పాపులారిటీ పొందాడు. అతను చాల పెద్ద బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తున్నారు, ఇలా కూడా అతని ఆదాయం గొప్ప పెంచుతుంది. పాండ్యా ప్రమోట్ చేసే కొన్ని ప్రముఖ బ్రాండ్లు చూస్తే బోట్ (ఆడియో & స్మార్ట్ వేరబుల్స్), మాన్స్టర్ ఎనర్జీ (ఎనర్జీ డ్రింక్), డ్రీమ్11 (ఫాంటసీ స్పోర్ట్స్), గల్ఫ్ ఆయిల్ (లూబ్రికెంట్లు), జిల్లెట్, విలన్ లైఫ్ (పెర్ఫ్యూమ్ బ్రాండ్), ఒప్పో (మొబైల్ బ్రాండ్) ఉన్నాయి. నివేదికల ప్రకారం, హార్దిక్ ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ.75 లక్షల నుండి రూ.1.5 కోట్ల వరకు వసూలు చేస్తాడు.
ఆస్తులు ఇంకా పెట్టుబడులు: హార్దిక్ పాండ్యా తన సంపాదనను ఖర్చు చేయకుండా రియల్ ఎస్టేట్ ఇతర పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాడు. వాటిలో గుజరాత్‌లోని వడోదరలో 6000 చదరపు అడుగుల పెంట్‌హౌస్ రూ.3.6 కోట్లు, ముంబైలోని వెర్సోవాలో 2BHK అపార్ట్‌మెంట్, ముంబైలోని బాంద్రాలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ 30 కోట్లు. దీనితో పాటు హార్దిక్ స్టార్టప్‌లు ఇతర వెంచర్లలో కూడా పెట్టుబడి పెట్టారు. ఇవి కాకుండా హార్దిక్ పాండ్యాకు ఖరీదైన, స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టం. అతని లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ రూ.6.2 కోట్లు, లంబోర్గిని హురాకాన్ EVO రూ.3.7 కోట్లు, ఆడి ఎ6 రూ. 60 లక్షలు, రేంజ్ రోవర్ వోగ్ రూ. 2 కోట్లు, మెర్సిడెస్ జి-వ్యాగన్ రూ.2.5 కోట్లు, పోర్స్చే కయెన్ రూ..5 కోట్లు ఉన్నాయి.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications