కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‍ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయంగా జరిగే హల్వా వేడుకను శనివారం నిర్వహించారు. నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్మలమ్మతో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు.
నిర్మలా సీతారామన్ మొదటిసారి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా నేపథ్యంలో బడ్జెట్ పత్రాలు ముద్రించడం లేదు. ఈసారి పేపర్ లేకుండానే బడ్జెట్ ఉంటోంది. పేపర్ లెస్ బడ్జెట్ నేపథ్యంలో సులభంగా, త్వరగా బడ్జెట్ సమాచారం అందించేందుకు వీలుగా యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను కూడా లాంచ్ చేశారు. డౌన్‌లోడ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ ఇన్ అండ్ ఔట్, బైడైరెక్షనల్ స్క్రోలింగ్, విషయ పట్టిక, ఇతర లింక్స్ యాక్సెస్ తదితర అంశాలతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లో అందుబాటులో ఉంటుంది.

ఎంపీలతో పాటు, సాధారణ ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్‌లోనే బడ్జెట్‌ను చూడవచ్చు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆ ప్రతులు యాప్‌లో అందుబాటులోకి వస్తాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications