హ్యాకర్స్ భారీగా డిజిటల్ కరెన్సీ దోపిడీకి పాల్పడ్డారు. బ్లాక్ చైన్ నెట్ వర్క్ కనెక్షన్ కలిగిన ప్రముఖ ఆన్ లైన్ గేమ్ యాక్సీ ఇన్ఫినిటీ ద్వారా 650 మిలియన్ డాలర్లు లేదా రూ.4500 కోట్ల క్రిప్టో కరెన్సీని దొంగిలించారు. క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెరగడంతో వాటి విలువ భారీగా పెరుగుతోంది. దీంతో హ్యాకర్స్ డిజిటల్ కరెన్సీ దోపిడీని ఎంచుకుంటున్నారు. అమెరికా డాలర్‌తో సమానమైన డిజిటల్ ఆస్తి నుండి 173,600 ఎథేర్, 25.5 మిలియన్ డాలర్ల స్టేబుల్ కాయిన్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.
మార్చి 23వ తేదీన ఈ హ్యాకింగ్ జరిగినట్లు గుర్తించారు.ఆ సమయంలో డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ 545 మిలియన్ డాలర్లు కాగా, మంగళవారం నాటికి ఇది 600 మిలియన్ డాలర్లు దాటింది. క్రిప్టో ప్రపంచంలోనే ఇది అతిపెద్ద దోపిడీగా చెబుతున్నారు. ఇక యాక్సీ ఇన్ఫినిటీ యుద్ధానికి సంబంధించిన గేమ్. ఇందులో గెలిచిన వారు స్మూత్ లవ్ పోర్షన్‌లో రివార్డ్స్ గెలుచుకుంటారు. ఈ రివార్డును క్రిప్టో కరెన్సీ లేదా నగదు రూపంలో మార్చుకోవచ్చు. ఈ మొత్తాన్ని తిరిగి గేమింగ్ వరల్డ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇదిలా ఉండగా, క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే నేడు (మార్చి 30) దాదాపు స్థిరంగా ఉంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలు బిట్ కాయిన్, ఎథేరియం స్వల్పంగా క్షీణించాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను మాత్రం 3 శాతానికి పైగా నష్టపోయాయి.
టెర్రా, సోలానా వంటి ఒకటి రెండు క్రిప్టోలు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 0.30 శాతం క్షీణించి 47,426 డాలర్లు, ఎథేరియం 0.39 శాతం క్షీణించి 3402 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 1.77 శాతం క్షీణించి 0.8616 డాలర్లు, కార్డోనో 1.83 శాతం క్షీణించి 1.19 శాతం వద్ద ట్రేడ్ అయ్యాయి. టెర్రా, సెలానా మాత్రం రెండు శాతానికి పైగా లాభపడ్డాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications