అమెరికాలో మంచి కెరీర్ కోసం వెతికే భారతీయ టెకీలు, ప్రొఫెషనల్స్‌కి ఎప్పటి నుంచో H-1B వీసానే పెద్ద డ్రీమ్. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలను తీసుకొస్తూ, H-1B వీసాను పరిమితం చేయడం లేదా నిలిపివేయడం గురించి ఆలోచిస్తోంది. దీంతో వేలాది మంది భారతీయులు ఇప్పుడు అమెరికా కాకుండా ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

ట్రంప్ మొదటి టర్మ్‌లోనే H-1B వీసాలపై పరిమితులు పెట్టడానికి ప్రయత్నించారు. అవుట్‌సోర్సింగ్ కంపెనీలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నాయి, అమెరికన్ వర్కర్స్‌కి అవకాశాలు తగ్గుతున్నాయి అని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు . ఇప్పుడు రెండో టర్మ్‌లో ఇంకా కఠినమైన చర్యలు ప్రతిపాదిస్తున్నారు. వీసా వ్యవధి తగ్గించడం, బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ కఠినతరం చేయడం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో విదేశీ వర్కర్లపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు చర్చలో ఉన్నాయి. భవిష్యత్తులో H-1B దారులు కొంచెం కష్టమవుతాయన్న మాట.
అయితే, H-1B వీసా ఒకటే మార్గం కాదు. నిజానికి, భారతీయుల కోసం ఇప్పుడు అనేక దేశాలు తలుపులు తెరుస్తున్నాయి. అవి ఏమిటో చూద్దాం.
1. కెనడా
ఇది అమెరికాకు అత్యంత దగ్గర ఎంపిక అని చెప్పొచ్చు. కెనడా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS) ప్రోగ్రామ్ ద్వారా IT, ఇంజనీరింగ్, సైన్స్ రంగాల ప్రొఫెషనల్స్‌కి కేవలం రెండు వారాల్లోనే వర్క్ పర్మిట్ ఇస్తుంది. అది కాకుండా Express Entry అనే పాయింట్స్ ఆధారిత సిస్టమ్ ద్వారా శాశ్వత నివాసం (PR) పొందొచ్చు. ముఖ్యంగా, జాబ్ ఆఫర్ లేకుండానే అర్హత సాధించే అవకాశం ఉంటుంది. జాబ్స్ ఈజీగా దొరికే అవకాశం ఎక్కువగా ఉండటం, ఫ్యామిలీకి అనుకూలమైన రూల్స్ ఉండటం వల్ల కెనడా చాలా మందికి బాగా నచ్చుతుంది.
2. ఆస్ట్రేలియా
ఈ దేశం స్కిల్డ్ మైగ్రేషన్ పథకాలలో ముందుంటుంది. Subclass 189, 190, 482 వంటి వీసాలు IT, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ రంగాల వారికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, ఇవి H-1B లాంటివి లాటరీ సిస్టమ్ కాదు. క్లీన్ ప్రాసెస్ ఉంటుంది. జాబ్ ఇచ్చే కంపెనీ సపోర్ట్ లేకపోయినా, అక్కడ సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
3.జర్మనీ మరియు యూరప్ దేశాలు
జర్మనీ మరియు యూరప్ దేశాలు కూడా మంచి ఆప్షన్. జర్మనీలో EU Blue Card చాలా ప్రాచుర్యం పొందింది. ఒక ఫిక్స్‌డ్ సాలరీ లెవల్ చేరుకుంటే రెసిడెన్సీ లభిస్తుంది. అదికాకుండా జాబ్ సీకర్ వీసా ద్వారా ఆరు నెలలు అక్కడ ఉండి ఉద్యోగం వెతికే అవకాశం ఉంటుంది. జర్మనీతో పాటు మాల్టా, లక్సెంబర్గ్ వంటి యూరప్ దేశాలు కూడా IT, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్‌కు తలుపులు తెరుస్తున్నాయి.
ఇంకా ఆసక్తికరంగా ఏమిటంటే, అమెరికాలోనే H-1B తప్ప ఇతర వీసా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి, O-1 Visa - ఇది అసాధారణ ప్రతిభ ఉన్నవారికి, ముఖ్యంగా STEM, ఆర్ట్స్, బిజినెస్ రంగాల వారికి. తర్వాత L-1 Visa. ఇది మల్టినేషనల్ కంపెనీలలో పనిచేస్తున్నవారికి ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ఫర్లకు అనుకూలం. అదికాకుండా EB-2 NIW ద్వారా అత్యంత విద్యావంతులైన వారు ఉద్యోగదాత అవసరం లేకుండానే గ్రీన్‌కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా Cap-exempt H-1Bs అనే వీసాలు కూడా ఉన్నాయి, ఇవి అకాడెమిక్, నాన్‌ప్రాఫిట్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసేవారికి లభిస్తాయి.
4. మిడిల్ ఈస్ట్ & ఆసియా:
మిడిల్ ఈస్ట్ & ఆసియా వైపు చూస్తే, UAEలో Green Visa, Golden Visa ప్రోగ్రామ్‌లు ప్రొఫెషనల్స్, ఎంట్రప్రెన్యూర్స్, ఫ్రీలాన్సర్స్ కోసం చాలా ప్రాచుర్యం పొందాయి. దీర్ఘకాలిక రెసిడెన్సీ, వేగవంతమైన ప్రాసెసింగ్, లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేకపోవడం వీటి ప్రత్యేకత. అలాగే సింగపూర్ ఎంప్లాయిమెంట్ పాస్ కూడా IT, ఇంజనీరింగ్ రంగాల్లో అత్యంత డిమాండ్‌లో ఉంది.
5. న్యూజిలాండ్
అక్కడ 'స్కిల్డ్ మైగ్రెంట్ వీసా' పాయింట్స్ ఆధారంగా ఇస్తారు. IT, హెల్త్‌కేర్ రంగాల్లో శాశ్వత నివాసం పొందే మార్గం ఉంది. మరో వైపు, అనేక దేశాలు ఇప్పుడు రిమోట్ వర్క్ వీసాలు అందిస్తున్నాయి. దీని ద్వారా మనం మన దేశంలో ఉండి గ్లోబల్ కంపెనీల కోసం పని చేసే అవకాశం లభిస్తుంది. శాశ్వతంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ దేశాలు H-1B కంటే ఎందుకు మెరుగ్గా కనిపిస్తున్నాయి? మొదటగా, ఇవి లాటరీ సిస్టమ్ కావు. ఎక్కువగా మెరిట్ బేస్డ్. మీ స్కిల్స్, క్వాలిఫికేషన్‌కి ప్రాధాన్యం ఉంటుంది. రెండోది, ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. మూడోది, శాశ్వత నివాసం దారి సులభంగా ఉంటుంది. నాలుగోది, ఫ్యామిలీ ఫ్రెండ్లీ పాలసీలు ఉంటాయి. చివరిగా, కంపెనీ అప్రూవల పై ఆధారపడాల్సిన అవసరం తక్కువ.
మొత్తానికి, H-1B వీసా కఠినతరమైతే, అది ఒక్కటే ఆప్షన్ కాదు. భారతీయులకు ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, యూరప్, UAE, సింగపూర్, న్యూజిలాండ్. ఇకపై అమెరికా ఒక్కటే లక్ష్యం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారతీయ ప్రతిభకు తలుపులు తెరుస్తున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications