Gukesh Dommaraju Tax: అంతర్జాతీయ స్థాయిలో తెలుగోళ్ల పరువు నిలబెట్టిన గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ కైవలం చేసుకున్నాడు. ఇటీవల సింగపూర్ వేదికగా నిర్వహించిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించిన గుకేశ్ సంచలనంగా మారాడు.
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన చిన్న వయస్కుడిగా నిలిచి అందరి మన్నలలు అందుకుంటున్నాడు. ఎలాన్ మస్క్ నుంచి సుందర్ పిచాయ్ వరకు ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం అభినందించటం గమనార్హం. అయితే టోర్నీలో విజేతగా నిలిచిన గుహేశ్ ప్రైజ్ మనీ రూపంలో దాదాపు రూ.11.34 కోట్లు అందుకున్నారు. అయితే ఇప్పుడు చర్చ ఆయన కట్టిన భారీ ఆదాయపు పన్ను గురించే ఇంటర్నెట్‍లో కొనసాగుతోంది. అయితే ఇందులో భారత ప్రభుత్వానికి ఏకంగా పన్నుల రూపంలో రూ.4.67 కోట్లను చెల్లించటం గమనార్హం.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఛాంపియన్‌షిప్ కోసం మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు ప్రపంచ చెస్ సమాఖ్య నిర్ణయించింది. అయితే ఇక్కడ ఒక గేమ్ ఆఫ్ విన్ రూ.1.68 కోట్లు ఇస్తుంది. గుకేశ్ మూడు గేమ్‌లు గెలవటంతో రూ.5.04 కోట్లు అందుకున్నాడు. ఇక అతని ప్రత్యర్థి డింగ్ లిరెన్ రూ.3.36 కోట్లు సంపాదించాడు. ఇక మిగిలిన రూ.12.35 కోట్లు ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా పంచిపెట్టబడ్డాయి. అలా గుహేశ్ మెుత్తం రూ.11.34 కోట్లను పరిహారంగా పొందటం జరిగింది. దీనిలో 30 శాతం అంటే రూ.4.67 కోట్లు పన్నుల రూపంలో చెల్లించాల్సి వచ్చింది. ఇక మిగిలిన రూ.6.33 కోట్లను ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంత భారీ మెుత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేయటంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఆట ఆడకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.4.67 కోట్లు గెలుచుకున్నారని ఎద్దేవా చేశారు. చాలా మంది ఈ క్రమంలో పన్నులు తగ్గించాలని కూడా సూచిస్తున్నారు.
దీనికి ముందు ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలం పాటలో కూడా అచ్చం ఇలాంటి సంగటన ఒకటి చోటుచేసుకుంది. భారతీయ క్రికెటర్ రిషబ్ పంత్ రూ.27 కోట్లు పలికి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవగా పన్నుల తర్వాత కేవలం రూ.18.9 కోట్లను అతను అందుకున్నారు. ఇక ఇదే సమయంలో మరో ఆటగాడు మహీంద్రా సింగ్ ధోనీని రూ.4 కోట్లకు రిజర్వు చేసుకున్న సంగతి తెలిసిందే. అంటే ధోని అందుకున్న ఐపీఎల్ వేతనం కంటే గుహేశ్ చెల్లించిన పన్ను ఎక్కువగా ఉండటం మగనార్హం. వాస్తవానికి ఏదైనా ఆదాయాన్ని పొందినప్పుడు టీడీఎస్ రూపంలో పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే రిటర్న్ ఫైల్ చేసిన సమయంలో వాటి అర్హం, ఆదాయం వంటి ఇతర కారణాలను పరిగణలోకి తీసుకుని పన్ను చెల్లింపును ప్రజలు చేస్తుంటారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications