Success Story: ఉపాధి వేటలో ముంబైకి వచ్చిన 12 ఏళ్ల బాలుడు.. నేడు రూ.100 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతై..

Successful Business Man: దేశ ఆర్థిక రాజధాని ముంబై అనేక మందికి ఉపాధి కలిపించే నగరం. చాలా మంది తమ కలలను నిజం చేసుకునేందుకు మార్గం చూపించిన నగరం కూడా అదే. 1981లో గుజరాత్‌లోని కచ్‌లోని మేఘపర్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల భీమ్‌జీ పటేల్ అనే బాలుడు ఉద్యోగం వెతుక్కుంటూ ముంబై వెళ్లాడు. అప్పట్లో ముంబై కలలు కనేవారికి గేట్‌వే గా ఉండేది. ముంబైలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభించిన భీమ్‌జీ.. జేస్థాన్‌లో రూ.30 వేలు అప్పు తీసుకుని చిన్న దుకాణం ప్రారంభించాడు. వ్యాపారాన్ని పెంచి సూపర్ మార్కెట్‌గా మార్చాడు. భీమ్‌జీ పటేల్ ప్రస్తుతం రూ. 100 కోట్ల ఆదాయంతో మద్యం వ్యాపారిగా ఎదిగారు.

మోనికా ఎంటర్‌ప్రైజ్ పేరుతో..

మోనికా ఎంటర్‌ప్రైజ్ పేరుతో..

2008లో భీంజీ పటేల్ ముంబైలో మోనికా ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించారు. దేశంలోకి విదేశీ మద్యం బ్రాండ్‌లను దిగుమతి చేసి పంపిణీ చేసేది కంపెనీ. ముంబైలో తన ప్రారంభ జీవితంలో విదేశీ ఉత్పత్తులకు కమిషన్ ఏజెంట్‌గా పనిచేసిన అనుభవం అతనికి ఈ వ్యాపారంలో ఎంతగానో పనికొచ్చింది. ప్రారంభంలో.. మోనికా ఎంటర్‌ప్రైజెస్ కేవలం మద్యం పంపిణీ సంస్థగా ఉంటూ యధావిధిగా దిగుమతి చేసుకున్న బ్రాండ్‌లను రవాణా చేసింది.

కుమారునికి పగ్గాలతో..

కుమారునికి పగ్గాలతో..

భీమ్‌జీ పటేల్ కుమారుడు కునాల్ పటేల్ 2013లో వ్యాపారంలో తండ్రి వ్యాపారంలోకి చేరాడు. దీంతో మోనికా ఎంటర్‌ప్రైజెస్ కొత్త రూపు సంతరించుకుంది. ఇంతకుముందు కొన్ని బ్రాండ్లు మాత్రమే పంపిణీ చేస్తూ.. ప్రత్యేకమైన బ్రాండ్లు కూడా లేకుండా వ్యాపారం చేసేది. వీటన్నింటినీ మార్చేశాడు కునాల్. 2017లో కేవలం 2 బ్రాండ్‌లను మాత్రమే కలిగి ఉన్న మోనికా ఎంటర్‌ప్రైజెస్.. ప్రస్తుతం 42 బ్రాండ్లను కలిగి ఉంది. కంపెనీ దాదాపు 125 రకాల మద్యాన్ని పంపిణీ చేస్తోంది.

రూ.100 కోట్ల ఆదాయం..

రూ.100 కోట్ల ఆదాయం..

కునాల్‌ కంపెనీలో చేరిన తర్వాత కంపెనీ పెరూవియన్ వైట్ బ్రాందీ, పిస్కో బ్రాండ్‌లను దేశంలోకి ప్రవేశపెట్టింది. కంపెనీ విదేశీ బ్రాండ్లైన బెలెన్కియా వోడ్కా, రష్యన్ స్టాండర్డ్ వోడ్కా, జోస్ క్యూర్వో, క్రాకెన్, రాన్ డిప్లొమాటికో, బుష్‌మిల్స్‌లను ప్రారంభించింది. తండ్రి అనుభవంతో పాటు కునాల్ నేటి తరం ఆలోచనలతో కుటుంబ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. 2020లో కంపెనీ రూ.100 కోట్ల ఆదాయాన్ని సాధించిందని కునాల్ వెల్లడించారు.

టాక్స్ అడ్డంకులను దాటుకుని..

టాక్స్ అడ్డంకులను దాటుకుని..

టాక్సేషన్, లైసెన్సింగ్ మద్యం పంపిణీలో అతిపెద్ద అడ్డంకులుగా ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో పంపిణీకి ప్రత్యేక లైసెన్స్ అవసరం ఉంటుంది. దీంతో స్థానిక సరఫరాదారులతో ఒప్పందం కుదుర్చుకొవాలి. పన్నులు కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పంపిణీ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారినప్పుడు, చట్టాలు మారిపోతాయి. ఇలా మద్యం వ్యాపారంలో న్యాయపరమైన అడ్డంకులు ఉంటాయి.

అనేక రాష్ట్రాల్లో వ్యాపారం..

అనేక రాష్ట్రాల్లో వ్యాపారం..

ప్రతి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కష్టం. "అందుకే మార్కెట్‌లో బలమైన పోటీ లేదు, అనేక సమస్యలతో పాటు స్థానిక మార్కెట్ తెలిసిన వారితో పంపిణీ జరుగుతుంది" అని కునాల్ చెబుతున్నారు. కంపెనీ ప్రధాన మార్కెట్లు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, UP, అస్సాం, మేఘాలయల్లో ఉన్నాయి. కంపెనీ మహారాష్ట్ర, గోవాలో తన స్వంత పంపిణీ లైసెన్స్‌ను కూడా కలిగి ఉంది.

 కొత్త లక్ష్యాలతో ముందుకు..

కొత్త లక్ష్యాలతో ముందుకు..

మన దేశంలో Tequila మార్కెట్ వాటాను రెండంకెలకు తీసుకెళ్లడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన మార్కెటింగ్ బడ్జెట్‌లో 40 శాతాన్ని టేకిలాను ప్రోత్సహించడానికి ఖర్చు చేస్తోంది. కంపెనీ #OnlyTheBest అనే ట్యాగ్ లైన్ తో ముందుకు వెళుతోంది. భీమ్‌జీ పటేల్ తదుపరి లక్ష్యం తన స్వంత స్కాచ్, వైన్‌లను ప్రారంభించడమేనని వెల్లడించారు. దేశంలో పంపిణీ చేయకుండా విదేశీ బ్రాండ్ల సహకారంతో ఇక్కడే కొత్త మద్యాన్ని విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+