ఇప్పటికే భారత్ ప్రపంచంలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. ప్రతి సంవత్సరం సుమారు 240 మిలియన్ టన్నుల పాలు ఉత్పత్తి చేస్తుంది. అయినప్పటికీ దేశపు డైరీ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల ఎక్స్‌పోర్ట్ పరిమితి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు న్యూజీలాండ్ సంవత్సరానికి సుమారు 20 మిలియన్ టన్నుల డైరీ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది, ఇది ప్రపంచ డైరీ వ్యాపారంలో 35% వాటా. భారత్, ఇదే సమయంలో, కేవలం 1 మిలియన్ టన్నుల డైరీ ఉత్పత్తులను మాత్రమే ఎగుమతి చేస్తోంది.

డైరీ ఉత్పత్తులపై ఉన్న భారం, ముఖ్యంగా 12% GST, రైతులకి మరియు ఎగుమతిదారులపై భారంగా ఉంది. ఈ పన్నులను తగ్గించడం ద్వారా, మొదట రైతులకి మంచి ధరలో తమ పాలను అమ్మగలుగుతారు. అంతేకాదు, ఇండస్ట్రీకి కూడా లాభం, ఎందుకంటే డెవలపర్స్ మరియు ప్రాసెసర్లు తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు తయారు చేయగలుగుతారు.
ఇక వినియోగదారులు కూడా లాభమే ఎందుకంటే తక్కువ పన్ను వల్ల మార్కెట్లో ఉత్పత్తుల ధర తగ్గుతుంది. అలాగే, దేశానికి ఎక్స్‌పోర్ట్ అవకాశాలు విస్తరించడం ద్వారా భారత్ గ్లోబల్ డైరీ మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా ఉండగలదు. GST తగ్గింపు వల్ల డైరీ పరిశ్రమకు, రైతులకు, వినియోగదారులకు సమానంగా లాభం కలుగుతుంది. దేశ ఆర్థికాభివృద్ధికి కూడా సహాయపడుతుంది.
హాట్సన్ అగ్రో ప్రొడక్ట్ చైర్మన్ ఆర్.జి. చంద్రమోఘన్ ప్రకారం, డైరీ ఉత్పత్తులపై ఉన్న 12% GSTని 5%కి తగ్గిస్తే, భారత డైరీ పరిశ్రమకు పెద్ద మార్పు రానుంది. NDTVతో చేసిన ఇంటర్వ్యూలో, ఆయన కొత్త GST రైతులను సానుకూలంగా ప్రభావితం చేసి, డిమాండ్ పెంచి, భారత్‌ను గ్లోబల్ డైరీ ఎక్స్‌పోర్ట్ పవర్‌గా మార్చగలదని చెప్పారు.
"అప్పుడు మనం ఎక్స్‌పోర్ట్‌లో ప్రపంచ శక్తిగా మారవచ్చు. రైతులు లాభపడతారు, గ్రామీణ మరియు పట్టణ మధ్య రేటు తేడా కూడా తగ్గుతుంది. ఐస్ క్రీమ్ సహా అన్ని డైరీ ఉత్పత్తులను 5% కింద తీసుకోవాలి" అని చంద్రమోఘన్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పిన కొత్త జనరేషన్ GST రిఫార్మ్స్ దీపావళి వరకు అమలు కానున్నాయని ఆయన ఆశ చూపించారు.
ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్ కేవలం 60 మిలియన్ టన్నులే. ఇది భారత ఉత్పత్తి యొక్క కేవలం 25%. ఇప్పుడు మనం ఎక్స్‌పోర్టర్స్. బాస్మతి రైస్ ఎక్స్‌పోర్ట్ చేసాము. అదే విధంగా డైరీ ఎక్స్‌పోర్ట్ కూడా పెద్దగా చేయవచ్చు," అని ఆయన చెప్పారు.
FY26 రెండవ భాగం ఇంకా బెటర్ అవుతుంది. వచ్చే సంవత్సరం గొప్పగా ఉంటుంది," అన్నారు చంద్రమోఘన్. GST తగ్గింపుతో డైరీ పరిశ్రమకు మూడు విధాలుగా లాభం జరుగుతుంది. పన్నులు తగ్గినందున వినియోగదారులకు ఉత్పత్తులు తక్కువ ధరలో లభిస్తాయి, రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది, మరియు దేశం డైరీ ఎగుమతుల్లో ప్రపంచ స్థాయిలో ప్రధాన స్థానాన్ని సంపాదించగలదు.
భారతదేశంలో డేరీ ఉత్పత్తిలో ప్రధాన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ సుమారు 16.21% పాలు మరియు ఇతర డేరీ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది, రాజస్థాన్ 14.51%, మధ్యప్రదేశ్ 8.91%, గుజరాత్ 7.65%, మహారాష్ట్ర 6.71%, ఆంధ్రప్రదేశ్ 4-5%, తెలంగాణ 3-4% వాటాతో ప్రధాన డేరీ ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ప్రాసెస్డ్ డేరీ ఉత్పత్తులలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. GST తగ్గింపుతో, భవిష్యత్తులో వీరి ఎగుమతి సామర్థ్యం మరింత పెరగవచ్చు.
మొత్తం మీద, కొత్త GST తగ్గింపు భారత డైరీ పరిశ్రమకు పెద్ద లాభాన్ని తెస్తుందని చెప్పవచ్చు. ఇది రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు తక్కువ ధరలు మరియు దేశానికి ఎగుమతి అవకాశాలను విస్తరించగలదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల డైరీ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతూ, భారత్‌ను గ్లోబల్ డైరీ ఎక్స్‌పోర్ట్ పవర్‌గా రూపొందించగలదు. ఈ చర్య భారత ఆర్థికాభివృద్ధికి, రైతులు మరియు వినియోగదారులకి సమాన లాభం అందించే కీలక నిర్ణయంగా నిలుస్తుంది.
More From GoodReturns

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications